సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం కొండపొలం. సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కరోనా మొదటి వేవ్ సమయంలో ‘కొండపొలం’ నవల చదివి ఆకర్శితుడైన క్రిష్.. ఈ నవల హక్కులను తీసుకొని సినిమాగా మలిచేందుకు పూనుకున్నారు. మాతృకను ఏమాత్రం మార్చకుండా.. అందులోని ఫీల్ మిస్ కాకుండా.. పకడ్భందీగా తెరకెక్కించారు. నవలల ఆధారంగా తెలుగు సినిమాలు తెరకెక్కిన రోజులను మరో సారి గుర్తు చేశారు క్రిష్.
ఇక ఆగస్టు 20న రిలీజైన కొండ పొలం ఫస్ట్ లుక్.. వైష్ణవ్ తేజ్ లుక్‌ను రివీల్ చేసి తెలుగు ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని పెంచేసింది. ఆ తరువాత రిలీజైన ‘ఓబులమ్మా’ సాంగ్ మెలోడీగా సాగుతూ… యూట్యూబ్‌లో మిలియన్‌ల కొద్ది వ్యూస్ను సాధించింది. కీరవాణి సంగీత సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాటకు స్వయంగా కీరవాణే లిరిక్స్ అందించారు. సత్య యామిని, PVNS రోహిత్ ఆలపించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. స్టోరీ బేస్ పాయింట్‌ను చెప్పేస్తూ.. ట్రైలర్ కట్ సూపర్! అనే టాక్ ను అంతటా వినబడేలా చేసింది.గొర్రె కాపరుల జీవితాలను.. వారి జీవనంలో భాగమైన ‘కొండపొలం’ విధానాన్ని.. ఆ విధానంలో మిలితమైన ఆచారా వ్యవహారాలను.. కష్ట సుఖాలను.. ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు క్రిష్. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇక ఈరోజ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో కొండపొలం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకను టీవీ9 లైవ్‌లో వీక్షించవచ్చు.
లైవ్..
Also Read: Samantha: చై-సామ్ విడాకుల కారణాన్ని సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ బయటపెట్టారా? వైరల్ పోస్ట్.!
Manchu Vishnu: ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్.. ఫ్యామిలీని లాగొద్దంటూ సీరియస్..