Ek Mini Katha Movie: మేర్లపాక గాంధీ-యువి కాంబినేషన్ లో రానున్న ఏక్ మినీ కథ.. హీరోగా సంతోష్ శోభన్
యు వి క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటి ఆఫ్ మూవీస్ నిర్మించే నిర్మాణ సంస్థ. మిర్చి నుండి ఇప్పడు రాధేశ్యామ్ వరకూ దర్శకుడి కథని నమ్మి మార్కెట్ కి ఏమాత్ర సంబందం లేకుండా గ్రాండియర్ గా సినిమాలు తెరకెక్కించారు.
Ek Mini Katha Movie: యు వి క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటి ఆఫ్ మూవీస్ నిర్మించే నిర్మాణ సంస్థ. మిర్చి నుండి ఇప్పడు రాధేశ్యామ్ వరకూ దర్శకుడి కథని నమ్మి మార్కెట్ కి ఏమాత్ర సంబందం లేకుండా గ్రాండియర్ గా సినిమాలు తెరకెక్కించారు. యు వి క్రియోషన్స్ బ్యానర్ కి అనుభంద సంస్థ గా యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ ని స్థాపించి ప్రేక్షకుడి వినోదాన్ని డబుల్ చేస్తున్నారు. ఈ బ్యానర్ లో మొదటి చిత్రం గా ఏక్ మిని కథ ని తెరకెక్కించారు. మిర్చి లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత సుజిత్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రన్ రాజా రన్ , రాధాకృష్ణ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ జిల్ లాంటి చిత్రాలు నిర్మించి సూపర్ హిట్స్ అందించిన నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్. ఇప్పడు ఏక్ మిని కథ చిత్రం తో కార్తీక్ రాపోలు దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.డజ్ సైజ్ మ్యాటర్ అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా పేపర్ బాయ్ చిత్రం తో తెలుగు తెరకి పరిచయమయ్యి మంచి నటుడి గా ప్రేక్షకుడి చేత మంచి మార్క్ లు వేయించుకున్నాడు. ఇప్పడు ఏక్ మిని కథ చిత్రం లో చాలా ఢిఫరెంట్ కథ తో ప్రేక్షకుడ్ని నవ్విండానికి సిధ్ధమయ్యాడనే విషయం టీజర్ చూసిన అందరికి అర్ధం అవుతుంది. అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లం పెద్దదే బ్రో అనే డైలాగ్ లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అలాగే ఎక్స్‌ప్రేస్ రాజా చిత్రంతో యు వి క్రియేషన్స్ బ్యానర్ లొ సక్సస్ ని సాధించిన రచయిత, దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథని అందించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్,ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్దం లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్న మేర్లపాక గాంధీ ఇప్పుడు ఈ ఏక్ మిని కథ కి కథ, రచన ఇవ్వటమే కాకుండా దర్శకుడు కార్తీక్ రాపోలుకి తన సపోర్ట్ ని అందించడం విశేషం.
మరిన్ని ఇక్కడ చదవండి :
ఫిక్స్ అయిపో అంటున్న యంగ్ హీరో కార్తికేయ.. చావు కబురు చల్లగా మూవీనుంచి మరో సాంగ్..