
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దాంతో రాజకీయనాయకులతో పాటు పలువురు సినిమా సెలబ్రెటీలు కూడా రెడీ అవుతున్నారు. అదేదో సినిమాలో త్రివిక్రమ్ రాసినట్టు.. వయసైపోయిన హీరోలు రాజకీయ నాయకులు అవుతారు.. ఇది నిజమే చాలా మంది సీనియర్ హీరోలు, హీరోయిన్స్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు యంగ్ హీరోలు, స్టార్ హీరోలు కూడా పోటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్. తమిళ నట దళపతి విజయ్ లాంటి వారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి హీటు పెంచేశారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ సినిమా తరాల సందడి కనిపిస్తుంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు రాజకీయాల్లోకి రానున్నారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా దీనిపై కీలక ప్రకటన చేసింది.
తనకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వచ్చిందని తెలిపింది ఊర్వశి రౌతేలా. అయితే తనకు ఏ నియోజకవర్గం, ఏ పార్టీ నుంచి టికెట్ లభించింది అనే విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఊర్వశికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎన్నికలు వస్తే రాజకీయ నేతలు సెలబ్రిటీలకు టిక్కెట్లు ఇస్తుంటారు. వారి క్రేజ్ ను ఓట్లుగా మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఊర్వశికి కూడా టిక్కెట్ ఇవ్వాలని రాజకీయ నేతలు ప్రయత్నించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల టిక్కెట్ గురించి మాట్లాడుతూ.. ‘నాకే టిక్కెట్ వచ్చింది. అయితే నేను పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. నేను పోటీ చేయాలా వద్దా అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి’ అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో ఊర్వశిని రాజకీయాలపై ఓ ప్రశ్న అడిగాడు రిపోర్టర్. మీకు రాజకీయాలపై ఆసక్తి ఉందా అని అడిగినప్పుడు, తనకు ఎన్నికల టిక్కెట్ లభించిందని తెలిపింది. దాంతో నెటిజన్స్ రకరకాల స్పందిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది సినిమాలు చేస్తే చాలు అని మరికొందరు దీనిని పబ్లిసిటీ స్టంట్ అన్నారు. మరి ఇది నిజంగా పబ్లిసిటీ స్టంటా లేక ఏదైనా రాజకీయ పార్టీ నిజంగానే ఊర్వశికి టికెట్ ఇచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.