Uorfi javed : ఓరిని పెళ్లి చేసుకుంటానన్న ఉర్ఫీ జావేద్‌.. అతను ఏమన్నాడంటే

|

Jun 15, 2024 | 2:17 PM

రకరకాల డ్రస్సులు వేసుకుంటూ చిత్రవిచితంగా కనిపిస్తుంది ఆమె.  ఆమె తన వింత దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ పేరుతో పాటు మరో వ్యక్తి పేరు కూడా బాగా వినిపిస్తుంది. అతనే ఓరి. ఓరి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.  ఓరి, ఉర్ఫీ పెళ్లి చేసుకుంటారు అంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి.

Uorfi javed : ఓరిని పెళ్లి చేసుకుంటానన్న ఉర్ఫీ జావేద్‌.. అతను ఏమన్నాడంటే
Orry,urfi Javed
Follow us on

సోషల్ మీడియాలో ఎక్కువగా రచ్చ చేసే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ఉర్ఫీ జావేద్. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల డ్రస్సులు వేసుకుంటూ చిత్రవిచితంగా కనిపిస్తుంది ఆమె.  ఆమె తన వింత దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్ పేరుతో పాటు మరో వ్యక్తి పేరు కూడా బాగా వినిపిస్తుంది. అతనే ఓరి. ఓరి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.  ఓరి, ఉర్ఫీ పెళ్లి చేసుకుంటారు అంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడంతో చాలా మంది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఇదే విషయం పై ఉర్ఫీ జావేద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఉర్ఫీతో కెమెరాపర్సన్స్ తో మాట్లాడుతూ పెళ్లి గురించి కామెంట్స్ చేసింది.కెమెరాపర్సన్స్ అడిగిన ప్రశ్నలకు  ఉర్ఫీ సమాధానం ఇచ్చింది. అలాగే  కెమెరా ముందు ఫోజులు కూడా ఇచ్చింది. ఆమె గ్రీన్ కలర్ రివీలింగ్ సింగిల్ పీస్ డ్రెస్‌లో మెరిసింది. ఇంతలో అక్కడ ఉన్న ఓ కెమెరామెన్ ఓరిని పెళ్లి చేసుకుంటావా అని ఉర్ఫీని అడిగాడు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ఓరి ఒప్పుకోవడం లేదని, లేకుంటే కచ్చితంగా పెళ్లి  చూసుకునేదాన్ని అని తెలిపింది. ఇంతలో ఓరి కూడా అక్కడికి వచ్చాడు. ఈ సమయంలో, ఒక వ్యక్తి ఓరిని ఉర్ఫీ జావేద్‌ని పెళ్లి చేసుకుంటావా అని కూడా అడిగాడు. దీనిపై ఓరి సిగ్గుపడుతూ- ఎందుకు చేసుకోను, ఏ అబ్బాయి ఉర్ఫీని పెళ్లి చేసుకోడు చెప్పండి అని సమాధానం ఇచ్చాడు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. . మొదటి సారి ఇద్దరూ కలిసి చాలా బాగున్నారు. ఆనందంగా చూస్తున్నారు. మరొక వ్యక్తి ఇలా వ్రాశాడు – ఇద్దరూ ఒకరికొకరు సరైనవారు, పెళ్లి చేసుకోండి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఓరి, ఉర్ఫీ జావేద్‌ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..