Upasana Konidela: పెళ్లి రోజు క్యూట్ ఫోటో షేర్ చేసిన ఉపాసన.. తల్లిదండ్రులతో కలిసి క్లీంకార వాకింగ్..

|

Jun 15, 2024 | 9:59 PM

మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా పంచుకుంటారు. తాజాగా మెగా అభిమానులకు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు. వీరిద్దరి వివాహం జరిగి నేటికి పన్నెండేళ్లు పుర్తవుతుంది. ఈ సందర్భంగా మెగా జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తనకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది ఉపాసన. అలాగే మెగా ఫ్యాన్స్ అసలు ఉహించని ఫోటో షేర్ చేసింది.

Upasana Konidela: పెళ్లి రోజు క్యూట్ ఫోటో షేర్ చేసిన ఉపాసన.. తల్లిదండ్రులతో కలిసి క్లీంకార వాకింగ్..
Ram Charan, Upasana
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిత్యం ఫ్యామిలీ విషయాలు లేదంటే అత్తమ్మ కిచెన్ గురించి ప్రమోట్ చేస్తూ ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. అలాగే మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా పంచుకుంటారు. తాజాగా మెగా అభిమానులకు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు. వీరిద్దరి వివాహం జరిగి నేటికి పన్నెండేళ్లు పుర్తవుతుంది. ఈ సందర్భంగా మెగా జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తనకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది ఉపాసన. అలాగే మెగా ఫ్యాన్స్ అసలు ఉహించని ఫోటో షేర్ చేసింది.

తనకు పెళ్లి రోజులు తెలిపిన అభిమానులకు థాంక్స్ చెప్పడంతో కూతురు క్లీంకార లేటేస్ట్ ఫోటోను పంచుకుంది ఉపాసన. ఆ ఫోటోలో క్లీంకార తన ఫాదర్ రామ్ చరణ్.. మదర్ ఉపాసన చేతులు పట్టుకుని నడవడానికి ప్రయత్నిస్తుంది. క్లీంకార క్యూట్ ఫోటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఉపాసన పోస్టుకు రామ్ చరణ్ రియాక్ట్ అవుతూ.. ఉప్సీ.. నీ బెటర్ హాఫ్ తో నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ రిప్లై ఇచ్చారు. అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్ రియాక్ట్ అవుతూ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇక సమంత, వరుణ్ తేజ్ సైతం మెగా జంటకు విషెస్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్, ఉపాసన 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2023లో క్లీంకార జన్మించింది. పాప పుట్టినప్పటి నుంచి తన ముఖం చూపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఉపాసన. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.