
టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక నల్కార్. ఒకప్పుడు తెలుగులో పలు సీరియల్స్ ద్వారా అలరించిన ఆమె.. ఇఫ్పుడు తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. అక్కడ వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. అచ్చమైన తెలుగమ్మాయి… కానీ తెలుగు సినీరంగంలో మాత్రం ఆమెకు సరైన అవకాశాలు.. గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు తమిళంలో మాత్రం స్మాల్ స్క్రీన్ పై స్టార్ డమ్ సొంతం చేసుకుంది. నటనతో పాటు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించే ఆమె, తాజాగా ఓ షోలో పాల్గొని తన జీవితంలోని చేదు నిజాలను బయటపెట్టారు. అందులో ప్రియాంక ఎంతో బాధగా, కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన విషయాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో డేట్‌కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
ప్రియాంక మాట్లాడుతూ, తన గత జీవితం ఎంతటి నరకాన్ని చూసిందో వివరించారు. తాను ఎంతో నమ్మి ప్రేమించిన వ్యక్తి, చివరికి తనను మోసం చేశాడని, ఆ ఘటన తన జీవితాన్ని అతలాకుతలం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను మానసికంగా ఎంత కృంగిపోయానో చెబుతూ, ఆ బాధ నుండి బయటపడలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆమె చేసిన కామెంట్స్ చూసేవారిని కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రేమ పేరుతో తనను వాడుకున్నారని, అబ్బాయిలపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయానని అన్నారు. చాలా మంది బయటకు నవ్వుతూ కనిపించినా, లోపల ఎంతటి ఆవేదనను అనుభవిస్తారో చెప్పడానికి ప్రియాంక జీవితమే ఒక ఉదాహరణ. తన కుటుంబానికి తానే పెద్ద దిక్కని, అందరి బాధ్యతలు చూసుకోవడం వల్లనే తాను ఇన్ని కష్టాలను తట్టుకుని నిలబడ్డానని చెప్పారు. తన సోదరీమణుల పెళ్లిళ్లు, కుటుంబ పోషణ అంతా తన భుజాల మీద వేసుకున్నానని, తన ఆనందం కంటే కుటుంబ సభ్యుల భద్రత, సంతోషమే తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..
ప్రియాంక గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఎవరిని గుడ్డిగా నమ్మి ప్రేమించవద్దని.. నీకోసం జీవితాంతం నిలబడతానని ప్రామిస్ చేసిన వాళ్లపై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత ప్రేమించాలని చెప్పుకొచ్చింది. తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదే అని.. ఒకసారి మోసపోయిన తర్వాత మళ్లీ మళ్లీ మోసపోవడానికి తనకు ఓపిక లేదని వెల్లడించింది. జీవితంలో తాను ఎదుర్కోన్న కష్టాలను, బాధలను గుర్తు చేసుకుంది. జీవితంలోకి మరో వ్యక్తి రాడు అని.. తానేప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..
ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..