
హిందీలో సూపర్ హిట్ సీరియల్ యే రిష్తా క్యా కెహలాతా హై సీరియిల్ తెలుగులో పెళ్లంటే నూరెళ్ల పంటగా డబ్ అయింది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన అక్షర అంటే నటి హీనా ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హీనా ఖాన్ ఇప్పుడు క్యాన్సర్‌తో పోరాడుతోంది. తాజాగా హీనా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. హీనా ఖాన్ తన ప్రియుడు రాకీ జైస్వాల్‌ను వివాహం చేసుకుంది. హీనా , రాకీలు రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె తన పెళ్ళికి సంబంధించిన చిత్రాలను అభిమానుల కోసం పంచుకుంది.
నటి హీనా ఖాన్ వివాహం చేసుకుంది. హీనా క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం కోసం అభిమానులను ప్రార్ధించమని అభిమానులను కోరిన సంగతి తెలిసిందే. తాజాగా హీనా తన ప్రియుడు రాకీతో ఏడు అడుగులు వేసింది. పెళ్ళికి సంబంధించిన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీనా, రాకీలకు ఫ్యాన్స్ తమ ప్రేమని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హీనా ఖాన్ తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. రెండు వేర్వేరు ప్రపంచాలను కలపడం ద్వారా మనం ఒకే ప్రపంచాన్ని సృష్టించుకున్నాం అంటూ క్యాప్షన్ జత చేసింది. మేము మా మనోవేదనలన్నింటినీ చెరిపివేసి.. జీవితాంతం ఉండే సంబంధాన్ని ఏర్పరచుకున్నాము. మేము ఒకరికొకరు ప్రపంచం.. ఈ రోజు నుంచి మేము ఒకరికొకరుగా జీవిస్తామని రాఖీపై ఉన్న ప్రేమని వ్యక్తం చేసింది.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
పెళ్లి కూతురుగా దేవకన్యలా కనిపిస్తున్న హీనా ఖాన్
పెళ్లి ఫోటోలలో హీనా, రాకీలు చాలా అందంగా ఉన్నారు. వీరు చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. హీనా ఒపల్ ఆకుపచ్చ రంగు . వెండి రంగు కాంబినేషన్ తో ఉన్న చీరను ధరించింది. చాలా అందమైన ఆభరణాలను కూడా ధరించింది. హీనా చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు. హీనా వరుడు రాకీ కూడా ఓక్ తెల్లటి షేర్వానీ ధరించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..