Megastar Chiranjeevi : మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. చిరు సినిమాలో సెకండ్ హీరోయిన్ గానైనా కనిపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏ హీరోయిన్ అయినా ఒక్కసారి చిరు పక్కన నటించిందంటే చాలు ఇక ఆ అమ్మడి రేంజ్ మారిపోతుంటుంది. అలాగే.. ఒక్క సారి బాసు పక్కన నటించి మంచి కెమెస్ట్రీ కుదిరితే చాలు.. ఇక బాసుతో వరుస అవకాశాలు వస్తూనే ఉంటాయి మరి.. ఒకప్పటి హీరోయిన్లు రాధ, రాధిక, విజయశాంతిలు చిరు జోడిగా ఎన్నో సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటి హీరోయిన్లంతలా కాకపోయినా ఇప్పటి తరంలో… ఓ హీరోయిన్ చిరు సరసన నటించి మంచి పేరుతెచ్చుకుంది. ఇప్పుడు మరో సారి చిరు సినిమాలో అవకాశం కొట్టేసింది ఇంతకు ఆ భామ ఎవరనుకుంటున్నారా ..
2006లో మెగాస్టార్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్లో రిలీజైన చిత్రం ‘స్టాలిన్’. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా త్రిష నటించి మంచి పేరు తెచ్చుకుంది. మళ్లీ 15 సంవత్సరాల తరువాత అదే త్రిష మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటించనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను తెలుగులో మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మెగాసటర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని సినిమాలో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా పలువురిపేర్లు వినిపించాయి. మొదట్లో నయనతార పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు త్రిష పేరు తెరపైకి వచ్చింది.
మరో విషయం ఏంటంటే.. కొరటాల శివ ‘ఆచార్య’లో కూడా మొదట త్రిషనే హీరోయిన్గా అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారు. అయితే నయన్ తారను మొదట్లో అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక ఈ ఆఫర్ మున్ను సున్నితంగా తిరస్కరించారట. దాంతో ఆమె ప్లేసులోకి త్రిష ఎంపిక చేశారట. మరోసారి చిరుతో కలిసి నాటించడానికి త్రిష కూడా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Actor Sunil : మరో సినిమాను అనౌన్స్ చేసిన సునీల్.. ఈ సారి భయపెట్టనున్న కమెడియన్ కం విలన్