Tollywood : సింగిల్‌ స్క్రీన్…డబుల్‌ ఫైట్‌.. పర్సంటేజీ సిస్టమ్‌ కావాలని డిమాండ్‌

సింగిల్‌ స్క్రీన్...డబుల్‌ ఫైట్‌. ఒకే తెరపై 2 వెర్షన్లు వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి. సింగిల్‌ స్క్రీన్ థియేటర్లు బతకాలంటే హీరోలు ఎక్కువ సినిమాలు చెయ్యాలి, అంతంత రెమ్యూనరేషన్లు ఏంటి అని విమర్శలు ఒకవైపు..హీరోలే దేవుళ్లు. దేవుళ్ల రెమ్యూనరేషన్‌ పైనే ప్రశ్నలా అని మరో వెర్షన్‌ వినిపిస్తోంది.

Tollywood : సింగిల్‌ స్క్రీన్...డబుల్‌ ఫైట్‌.. పర్సంటేజీ సిస్టమ్‌ కావాలని డిమాండ్‌
Movie Theaters

Updated on: Jun 08, 2025 | 12:06 PM

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల డబుల్‌ అండ్‌ డబ్బుల్‌ కష్టాలు మరోసారి తెరపై తళుక్కుమన్నాయి. పర్సంటేజీ సిస్టమ్‌ లేకపోవడంతో, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మూత పడే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు ఎగ్జిబిటర్లు. సింగిల్‌ స్క్రీన్ థియేటర్లను కాపాడండి మహా ప్రభో అంటున్నారు వాళ్లు. 2016 నుంచి సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు పర్సంటేజ్‌ సిస్టమ్ ఇవ్వాలని కొట్లాడుతున్నామని, ఇప్పటికైనా అది సాకారం కావాలంటున్నారు వాళ్లు. తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ సాక్షిగా ఈ టాపిక్‌ మరోసారి హాట్‌హాట్‌గా తెర పైకి వచ్చింది

హీరోలు రెండేళ్లకో సినిమా తీస్తే సింగిల్ స్క్రీన్‌ థియేటర్లు ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నారు ఎగ్జిబిటర్లు. హీరోలు ఎక్కువ సినిమాలు తీయాలి, ఎక్కువ హిట్‌లు కొట్టాలి, అప్పుడే సింగిల్‌ స్క్రీన్లు కళకళలాడతాయంటున్నారు వాళ్లు. హీరోలకు స్టార్‌డమ్ ఇచ్చిందే సింగిల్ స్క్రీన్‌ థియేటర్లు, తాము స్టార్‌డమ్‌ ఇవ్వకపోతే హీరోలకు అంత ఫ్యాన్‌డమ్‌ వస్తుందా అంటూ విమర్శలు గుప్పించారు తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ సెక్రటరీ శ్రీధర్‌. అసలు హీరోలకు అంతంత రెమ్యూనరేషన్‌ ఎందుకంటూ విరుచుకుపడ్డారు ఆయన.

శ్రీధర్‌, టీజీ ఫిల్మ్‌ చాంబర్‌ సెక్రటరీ అయితే హీరోలు దేవుళ్ల లాంటి వాళ్లంటూ శ్రీధర్‌ వాదనకు కౌంటర్‌ ఇచ్చారు తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ప్రెసిడెంట్‌ సునీల్ నారంగ్‌. హీరోల రెమ్యూనరేషన్‌ గురించి మాట్లాడడానికి తాము ఎవరం అన్నారాయన. అది డిమాండ్‌ అండ్‌ సప్లయ్‌ మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్ని సినిమాలు చేయాలి అనేది హీరోల ఇష్టం అన్నారు సునీల్‌ నారంగ్‌. సింగిల్ స్క్రీన్‌ థియేటర్లకు పర్సంటేజీ సిస్టమ్‌ ఇవ్వాలనే డిమాండ్‌తో పాటు, ఇండస్ట్రీ సమస్యలపై కమిటీ ఏర్పాటుచేశారు. అది ఏం చేస్తుందో చూడాలి మరి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి