Singer Revanth: అరెరె… సింగర్ రేవంత్ భార్యకు డ్యాన్స్ టాలెంట్ ఉందా.. హుషారైన స్టెప్పులు
జనవరి 7... తన పెళ్లి రోజు కావడంతో భార్యతో కలిసి మాల్దీవులు ట్రిప్ వెళ్లాడు రేవంత్. అక్కడి ఈ జంట నేచర్‌ను మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు.
సింగర్ రేవంత్ గురించి తెలుగు జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేసేది ఏముంది. మస్త్ టాలెంట్ ఉన్న సింగర్.. ఎన్నో అవార్డులు అందుకున్నాడు. రివార్డులు గెలుచుకున్నాడు. ఇండియన్ ఐడాల్ 9 విన్నర్. బిగ్ బాస్ 6 విన్నర్‌గా నిలిచి.. తన స్థాయి ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. కాగా ఈ ఏస్ సింగర్.. తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. భార్య అన్వితతో కలిసి అక్కడి నేచర్‌ను అస్వాదిస్తున్నాడు. ఈ కపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెకేషన్ ఫోటోలు, వీడియోలు.. ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు.
అయితే అన్విత ఈ మధ్య ఇన్ స్టాలో యాక్టివ్ అవుతున్నారు. రేవంత్‌ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఇటీవల ఆమె పాటను అనుకరిస్తూ చేసిన డ్యాన్స్ స్టెప్పులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో ప్రజంట్ ఇన్ స్టాలో మస్త్ ట్రెండ్ అవుతుంది. రేవంత్ హుషారు ఆయన వైఫ్‌లోనూ కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అన్విత డ్యాన్స్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
2022 ఫిబ్రవరిలో రేవంత్-అన్వితల మ్యారేజ్ జరిగింది. ఏపీలోని గుంటూరులో వీరి పెళ్లి జరిగింది. ప్లే బ్యాక్ సింగర్‌గా పాటలు పాడుతూనే.. పలు మ్యూజిక్ షోలో రేవంత్ సందడి చేస్తున్నాడు. రేవంత్ 2022, డిసెంబర్ 1న తండ్రయ్యాడు. అతడు బిగ్ బాస్ ఇంట్లో ఉండగానే అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.