ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు.. అది నాకు పెద్ద షాక్.. నాగవంశీ కామెంట్స్

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్నారు నిర్మాత నాగవంశీ.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కథలను బట్టి సినిమాలు నిర్మిస్తూ టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు నాగవంశీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ..

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు.. అది నాకు పెద్ద షాక్.. నాగవంశీ కామెంట్స్
Nagavamshi

Updated on: Jan 05, 2026 | 3:34 PM

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నిర్మాత నాగవంశీ. చిన్న, పెద్ద అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. తాజాగా నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగవంశీ మాట్లాడుతూ.. 2025 తనకు మిశ్రమ అనుభవాలను మిగిల్చిందని, అయితే చాంబర్ ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్‌గా ఘన విజయం సాధించడం ఒక్కటి హ్యాపీ మూమెంట్ అని ఆయన పేర్కొన్నారు. 2024లో రివ్యూల గురించి మాట్లాడకూడదని తాను ఒక తీర్మానం చేసుకున్నానని నాగవంశీ తెలిపారు. జనాలు రెగ్యులర్ సినిమాలు చూడటం ఎలా మానేశారో, అలాగే రివ్యూల గురించి ఎంతసేపు మాట్లాడినా విసుగు చెందుతారని ఆయన తెలిపారు. తన రాబోయే సినిమా రిలీజ్‌ల గురించి మాట్లాడుతూ, 2026 చాలా బిజీగా ఉంటుందని, హిట్‌ల సంఖ్య ముఖ్యం కానీ రిలీజ్‌ల సంఖ్య కాదని నాగవంశీ తెలిపారు.

‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతికి, ‘ఫంకీ’ క్రిస్మస్‌కు అనుకున్నప్పటికీ, అనూహ్య పరిస్థితుల వల్ల అన్నీ ఒకే బంచ్‌గా మారాయని చెప్పారు. గత ఏడాది ఒకటి రెండు ఫ్లాపులు రాగానే, సోషల్ మీడియాలో తన పని అయిపోయిందని విమర్శలు వచ్చాయని, కానీ వాటికి భిన్నంగా తాను ఎక్కువ సినిమాలు చేయడం ప్రారంభించానని అన్నారు. ఆగస్టులో వచ్చిన ఫ్లాపులు తాను నిర్మించినవి కాదని, కేవలం డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలని, దానివల్ల తనను నిందించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. 2025లో తనను ఆశ్చర్యపరిచిన సినిమా గురించి అడగ్గా, తాను తీసిన ‘కింగ్డమ్’ అనుకున్న స్థాయిలో ఆడకపోవడం ఒక ఆశ్చర్యకరమైన విషయమని, సెకండ్ హాఫ్‌లో ఎక్కడో ట్రాక్ తప్పిందని ఆయన అన్నారు.

ఒక హీరో లేదా దర్శకుడితో సినిమా చేసిన తర్వాత ఫలితం సరిగా రాకపోతే, వారితో సంబంధాలు దెబ్బతింటాయనే అభిప్రాయాన్ని నాగవంశీ ఖండించారు. సినిమా జర్నీ స్మూత్‌గా ఉంటేనే సంబంధాలు నిలబడతాయని, హిట్ లేదా ఫ్లాప్ అనే అంశం ముఖ్యం కాదని స్పష్టం చేశారు. జర్నీ బాగా లేకపోతే హిట్ అయినా కూడా సినిమా చేయాలనిపించదని ఆయన అన్నారు. సినిమా ఇండస్ట్రీలో వార్తలు, గాసిప్‌లు, కలెక్షన్ల లెక్కలు, పోస్టర్ల ప్రచారం అంతా ఒక మిథ్ అని నాగవంశీ అన్నారు.  బుక్‌మైషో రేటింగ్‌లు, యూట్యూబ్ వ్యూస్‌లు, కలెక్షన్లు, పోస్టర్‌లు అన్నీ మేనేజ్ చేయబడతాయని, ఏది నిజమో తెలుసుకోవడం కష్టమని ఆయన అన్నారు. ఒక పెద్ద సినిమా ఘోరంగా ఫ్లాప్ అయితే తప్ప లేదా పెద్ద హిట్ అయితే తప్ప నిజం బయటపడదని, మిడ్‌రేంజ్ సినిమాల ఫలితాలు ప్రమోషన్స్ పై ఆధారపడి ఉంటాయని ఆయన చెప్పారు. హీరోలను సంతృప్తి పరచడానికి యావరేజ్ లేదా బిలో యావరేజ్ సినిమాలను హిట్ సినిమాలుగా ప్రచారం చేయాల్సి వస్తుందని అన్నారు నాగవంశీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.