Mahesh Babu: మహేష్‌ బాబు వాడిన మొట్ట మొదటి ఫోన్‌ ఏంటో తెలుసా.? ఆసక్తికర విషయాలు తెలిపిన సూపర్‌ స్టార్‌.

|

Sep 24, 2021 | 10:31 PM

Mahesh Babu: టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో మహేష్‌ బాబు ఒకరు. మహేష్‌ నుంచి సినిమా వస్తుందంటే యావత్‌ సినీ జనం దృష్టి అటు పడుతుంది. బ్లాక్‌బ్లస్టర్‌ సినిమాలతో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన మహేష్‌..

Mahesh Babu: మహేష్‌ బాబు వాడిన మొట్ట మొదటి ఫోన్‌ ఏంటో తెలుసా.? ఆసక్తికర విషయాలు తెలిపిన సూపర్‌ స్టార్‌.
Follow us on

Mahesh Babu: టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో మహేష్‌ బాబు ఒకరు. మహేష్‌ నుంచి సినిమా వస్తుందంటే యావత్‌ సినీ జనం దృష్టి అటు పడుతుంది. బ్లాక్‌బ్లస్టర్‌ సినిమాలతో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన మహేష్‌.. బయటకు మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతుంటారు. ఇటీవల సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి అడపాదడపా ఫొటోలు పెడుతున్నారు కానీ.. అంతకు ముందు అది కూడా లేకుండేది. ఇక విలేకర్లు అడిగిన ప్రశ్నలకు కూడా మహేష్‌ చిరు నవ్వుతో ఎంత చెప్పాలో అంతే చెబుతుంటారు.

ఇదిలా ఉంటే కేవలం సినిమాలతోనే కాకుండా ప్రకటన ద్వారా కూడా మహేష్‌ ఫుల్‌ బిజీగా ఉంటారు. ఎన్నో ప్రఖ్యాత బ్రాండ్లకు మహేష్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మహేష్‌ ఓ మొబైల్‌ ఫోన్‌ రిటైల్‌ స్టోర్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహేష్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో ఎన్నడూ ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకోని కొన్ని విషయాలను ప్రిన్స్‌ పంచుకున్నారు.

‘మీరు ఉపయోగించిన తొలి మొబైల్‌ ఫోన్‌ ఏంటి.?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మహేష్‌ స్పందిస్తూ.. ‘‘నోకియా క్లాసికల్‌ మోడల్‌’ అని తెలిపారు. ఇక ‘చలా మంది మీతో సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు కదా.. మరి మీరు ఎవరితో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారు.?’ అని అడగ్గా ‘మా నాన్న’ అంటూ టక్కున సమాధానం చెప్పారు. మహేష్ బాబు కెరీర్‌ విషయానికొస్తే ఈ హీరో ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్‌ త్రివిక్రమ్‌తో ఒక సినిమా చేయనున్నారు, ఇది పూర్తికాగానే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు.

Also Read: Jabardasth Varsha: యెల్లో డ్రెస్‌లో నిమ్మపండులా నిగ‌నిగ‌లాడుతున్న జబర్దస్త్ వర్ష లేటెస్ట్ పిక్స్

Tollywood Heroine: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్… వరుణ్ తేజ్ మూవీలో నటించింది.. గుర్తించారా

Manchu Vishnu: ‘చంద్రబాబు గారు బంధువు.. జగన్ బావగారు’.. దయచేసి అలా లాగకండి