Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘న భూతో న భవిష్యతి’.. టాప్ వ్యూస్ లిస్టులో ఆరుగురు ‘మెగా’ హీరోలు!

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం మన రెండు రాష్ట్రాలకే పరిమితం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయంటే చాలు.. అమెరికా నుండి జపాన్ వరకు రికార్డులు తిరగరాయాల్సిందే అనే రేంజ్‌కి టాలీవుడ్ చేరుకుంది.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘న భూతో న భవిష్యతి’.. టాప్ వ్యూస్ లిస్టులో ఆరుగురు ‘మెగా’ హీరోలు!
Rrr1

Updated on: Jan 23, 2026 | 11:43 PM

కేవలం థియేటర్లలోనే కాదు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మీద కూడా తెలుగు సినిమా తన విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన సినిమాల జాబితా బయటకు రాగా.. అందులో మన సినిమాల హవా చూసి బాలీవుడ్ సైతం విస్తుపోతోంది. కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు, సున్నితమైన కుటుంబ భావోద్వేగాలు ఉన్న కథలను కూడా దేశవ్యాప్తంగా జనాలు ఎగబడి చూస్తున్నారు. మన స్టార్ హీరోల క్రేజ్‌ను చాటిచెప్పే ఆ టాప్ 10 సినిమాలు ఏంటి? ఏ సినిమాకు ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయి?

ఆర్‌ఆర్‌ఆర్ మొదటి స్థానంలో..

ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన అద్భుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం హిందీ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, ఏకంగా 4 కోట్ల 50 లక్షల (45 మిలియన్లు) వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఆస్కార్ గెలుచుకోవడానికి ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ ఆదరణే ప్రధాన కారణం.

Lucky Bhaskar1

లక్కీ భాస్కర్ & హాయ్ నాన్న..

రెండవ స్థానంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ నిలవడం విశేషం. సుమారు 2 కోట్ల 95 లక్షల వ్యూస్‌తో ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఈ సినిమాకు ఎక్కువ ఆదరణ దక్కింది. ఇక మూడవ స్థానంలో నాని నటించిన ‘హాయ్ నాన్న’ 2 కోట్ల 10 లక్షల వ్యూస్‌తో నిలిచింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఉత్తరాది ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

పుష్ప 2 నుండి కల్కి వరకు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ దాదాపు 2 కోట్ల వ్యూస్‌తో హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. థియేటర్లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ‘గుంటూరు కారం’కు ఓటీటీలో భారీ రెస్పాన్స్ రావడం విశేషం. ప్రభాస్ ‘సలార్’, ఎన్టీఆర్ ‘దేవర’ కూడా టాప్ లిస్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నాయి. అలాగే బాలయ్య ‘డాకూ మహారాజ్’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ వంటి సినిమాలు కూడా లక్షలాది మంది వీక్షకులను సొంతం చేసుకున్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే తెలుగు సినిమా స్థాయి కేవలం ప్రాంతీయ భాషకే పరిమితం కాకుండా, ప్రపంచస్థాయికి ఎదిగిందని అర్థమవుతోంది. మంచి కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఏ భాషలో ఉన్నా ఆదరిస్తారని ఈ సినిమాల విజయాలు నిరూపిస్తున్నాయి.