
టాలీవుడ్‌లో హై-వోల్టేజ్ ‘బాక్సాఫీస్ వార్’ నడుస్తోందిప్పుడు…! థియేటర్లు నడపలేక మునిగిపోతున్నాం, మాకూ కలెక్షన్స్‌లో పర్సంటేజ్ కావాల్సిందేనని పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు ఒకవైపు..! బ్లాక్‌మెయిల్ రూల్స్ పెడితే ఒప్పుకోం, అసలు సింగిల్ స్క్రీన్స్ పతనానికి కారణమే మీ మల్టీప్లెక్స్ వ్యాపారాలంటూ కౌంటర్ ఇస్తున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరొకవైపు..! ఇలా దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఈ మధ్యే ముదిరి పాకాన పడింది. దీంతో ఫిల్మ్ ఛాంబర్ కూడా ఎంట్రీ ఇచ్చి… 21 మందితో కలిపి ఓ కమిటీని వేసింది. అన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి కమిటీనే పర్సంటేజ్ లెక్క తేలుస్తుందని ఫిల్మ్ ఛాంబర్ క్లారిటీ ఇచ్చింది. దాని అందరూ సమ్మతమేనన్నారు. ఓ రెండు నెలల తర్వాత కమిటీ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయాలుంటాయంటే ఓకే చెప్పేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా… పెద్ది సినిమాకు రిలీజ్ ముందే చిరంజీవిని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కలవడం హాట్‌టాపిక్‌గా మారింది.
చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్లు.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్ విధానంలో నష్టాలను వివరించారు. పర్సంటేజ్ విధానం తెస్తేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందని చిరుకి చెప్పారు. ఇక ఎగ్జిబిటర్ల సాదకబాధకాలు విన్న చిరంజీవి… ఫిల్మ్ ఛాంబర్ వేసిన కమిటీ నివేదికను తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు మంగళవారం సాయంత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ నిర్మాతలు భేటీకానున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలతో పాటు పర్సంటేజ్ విధానంపైనా పవన్‌తో చర్చించనున్నారు. ఇక ఈమధ్యే ఎగ్జిబిటర్స్ సమస్యలపై స్పందించిన బాలకృష్ణ… సినిమాను బతికించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చిత్రసీమను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. దీంతో పవన్-నిర్మాతల భేటీ ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా… ఓవైపు అన్నయ్య, మరోవైపు తమ్ముడు… ఇద్దరూ పర్సంటేజ్ విధానంపై ఎలా స్పందిస్తారు…? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు…? అన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్…!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.