Tollywood : ప్రియుడితో బ్రేకప్.. ఇన్ స్టాలో ఫోటోస్ డిలీట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..

ప్రస్తుతం సినీరంగంలో లవ్, బ్రేకప్, డివోర్స్ అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రతి సెలబ్రెటీ లైఫ్, పర్సనల్ విషయాలు ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి. అలాగే సినీతారల బ్రేకప్, డివోర్స్ విషయాలు ప్రధాన ఇన్ స్టా ఫోటోస్ పైనే ఆధారపడి ఉంటున్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ఇన్ స్టాలో తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోస్ డిలీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఆమె గురించి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : ప్రియుడితో బ్రేకప్.. ఇన్ స్టాలో ఫోటోస్ డిలీట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..
Sunaina Yella Love And Breakup

Updated on: Jun 16, 2026 | 4:41 PM

సాధారణంగా చిత్రపరిశ్రమలో ప్రేమలు, నిశ్చితార్థాలు, ఆపై బ్రేకప్‌లు కామన్‌గా మారిపోయాయి. తాజాగా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సునయన తన ప్రియుడితో విడిపోయినట్లు టాక్ నడుస్తుంది. అందుకు కారణం ఆమె ఇన్ స్టాలో తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోస్ డిలీట్ చేయడమే. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈమె, ఇటీవలే ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కుబేర’ (Kuberaa) లో కీలక పాత్రలో నటించింది. గత ఏడాది కాలంగా సునయ దుబాయ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా, కొద్ది నెలల క్రితం తన నిశ్చితార్థానికి (Engagement) సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఒక వ్యక్తి చేయి పట్టుకున్న ఫోటోను పెట్టి, తన లైఫ్ పార్ట్‌నర్‌ను త్వరలోనే పరిచయం చేస్తానని హింట్ ఇచ్చింది. ఆ సమయంలో సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..

అయితే, ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు ఆమె తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల నుండి ఆ నిశ్చితార్థపు ఫోటోలను, అలాగే తన ప్రియుడికి సంబంధించిన పోస్టులన్నింటినీ పూర్తిగా డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట ఇలా హఠాత్తుగా విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇలా నిశ్చితార్థం తర్వాత ఫొటోలు తొలగించడం ద్వారా తమ బ్రేకప్ విషయాన్ని పరోక్షంగా నెటిజన్లకు హింట్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. దీనిపై సునయన ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..

నాగ్ పూర్ కు చెందిన సునయన కన్నడ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సిటెన్త్ క్లాస్ , మిస్సింగ్, వేటాడు వెంటాడు, ఎంతవరకు ఈ ప్రేమ, రాజ రాజ చోర, లాఠీ వంటి సినిమాలతో మెప్పించింది. 2005లో తెలుగులో కుమార్ వర్సెస్ కుమారి చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..

సునయన ఇన్ స్టా ఫోస్టులు ఇవే..

ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..

Follow Us