
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో ఒకరైన సుధ అందరికి సుపరిచితురాలే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె. సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు సుధ. అమ్మ, అత్త, వదిన పాత్రల్లో తన సహజనటనతో అలరిస్తున్నారు సుధ. ప్రస్తుతం తక్కువగా సినిమాలలో నటిస్తున్నారు. వరుసగా ఆఫర్లు వస్తున్నా, నచ్చిన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వైవిధ్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సుధ.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఆమె ఓ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సుధా మాట్లాడుతూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే తాను ఎక్కువగా నటించానని సుధ చెప్పారు. అలాగే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేశానని అన్నారు సుధ. సీనియర్ హీరోల దగ్గర నుంచి ఇప్పటికి జనరేషన్ యంగ్ హీరోల వరకు ఎంతో మందితో కలిసి పని చేసే అవకాశం దక్కింది అని ఆమె అన్నారు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న చాలా మంది హీరోలను తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని సుధ చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన ఉదయ్ కిరణ్ తనను ప్రేమగా అమ్మ అని పిలిచేవాడని, మరికొందరు యంగ్ హీరోలు కూడా తనను అమ్మ అని పిలుస్తారని సుధ చెప్పుకొచ్చారు.
హీరో మంచు మనోజ్ తో తనకు మంచి బాండింగ్ ఉండేదని సుధ తెలిపారు. అప్పట్లో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సమయంలో మనోజ్ సరిగ్గా అన్నం తినకపోతే, వాళ్ళమ్మ కొట్టేవారని, ఆ సమయంలో మనోజ్ వాళ్ళమ్మ తనకు నచ్చడం లేదని తన దగ్గరికి వెళ్తానని చెప్పేవాడని సుధ అన్నారు. చిన్నప్పుడు ఎత్తుకొని పెంచానని ఆమె అన్నారు. అలాగే మనోజ్ కు నేను అన్నం తినిపించేదాన్ని అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉంది అంటూ సుధ చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి