
టాలీవుడ్ నటి ప్రగతి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ఎన్నో సినిమాల్లో తల్లిగా, వదినగా కనిపించి సహజ నటనతో అలరించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన ప్రగతి.. తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు వైవిధ్యమైన పాత్రలు పోషించింది. కొన్నాళ్లుగా సినిమాల్లో ప్రగతి జోరు తగ్గింది. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ అడియన్స్ ముందుకు వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అలాగే రోజూ తన వర్కౌట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటుంది. రోజుకు కనీసం 8 గంటలైన జిమ్ లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో ప్రగతి రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
నటి ప్రగతి కొన్నాళ్లుగా సినిమాల్లో ఎక్కువగా కనిపించడంలేదు. ప్రస్తుతం ఆమె పవర్ లిఫ్టింగ్ మీదే ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రగతికి సంబంధించిన వర్కౌట్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యాయి. నిత్యం నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేసే ప్రగతి.. తాజాగా తన త్రోబ్యాక్ ఫోటో షేర్ చేసింది. 25 ఏళ్ల వయసులో తాను ఎలా ఉన్నానో చూడండి అంటూ పాత ఫోటోను షేర్ చేసింది. అందులో ప్రగతిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పటికీ ఇప్పటికీ ప్రగతి చాలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Actress Pragathi
ప్రస్తుతం ప్రగతి వయసు 48 ఏళ్లు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ప్రగతి .. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయింది. ఇప్పుడు తన పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని గతంలో ఓ ఇంటర్వ్యలో తెలిపింది. ఆర్థికంగా తన తల్లికి సాయం చేయడం కోసం కాలేజీ రోజుల్లో కొంతకాలంపాటు కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పానని.. చెన్నైలోని మైసూర్ స్కిల్ ప్యాలెస్ షోరూమ్ కోసం మోడల్ గా వర్క్ చేసినట్లు తెలిపింది. డైరెక్టర్ భాగ్యరాజా తెరకెక్కించిన వీట్టులే విశేషం సినిమాతో తెరంగేట్రం చేసింది ప్రగతి. అదే సినిమాను గౌరమ్మా నీ మొగుడెవరమ్మా పేరుతో తెలుగులో విడుదల చేశారు. కథానాయికగా దాదాపు ఎనిమిది సినిమాలు చేసింది ప్రగతి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.