AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Kausalya: 46 ఏళ్లొచ్చినా సింగిల్‌గానే.. ఈ ‘పంచదార చిలక’ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా మిగిలిపోయిన హీరోయిన్లలో ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా ఒకరు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ అందాల తార సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. ఇందుకు కారణమేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి.

Actress Kausalya: 46 ఏళ్లొచ్చినా సింగిల్‌గానే.. ఈ 'పంచదార చిలక' ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా?
Actress Kausalya
Basha Shek
|

Updated on: Jul 19, 2026 | 12:58 PM

Share

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. టబు, శోభన, నగ్మా, త్రిష, అనుష్క, సితార, సుస్మితా సేన్, అమీషా పటేల్ తదితర ముద్దుగుమ్మలకు పెళ్లి వయసు ఎప్పుడో దాటి పోయింది. అయినా పెళ్లి ఆలోచన లేకుండా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒకప్పుడు పలు తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ కౌసల్య కూడా ఈ జాబితాలోకే వస్తోంది. బెంగళూరులో పుట్టి పెరిగిన కౌసల్య.. 1996లోనే ‘ఏప్రిల్ 19’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లోనూ సినిమాలు చేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న కౌసల్య ఎక్కువగా హోమ్లీ పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది. తెలుగులో అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కౌసల్య. అలాగే గౌరీ, మహానంది, వియ్యాల వారి కయ్యాలు, రాంబాబు గాడి పెళ్లాం, రారండోయ్ వేడుక చూద్దాం, సవ్యసాచి, రంగ్ దే, హీరో, పురుషోత్తముడు తదిత సినిమాల్లో సహాయక నటిగాను మెప్పించారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. కౌసల్య వ్యక్తిగత జీవితం కాస్త ఆసక్తికరమే. 46 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదీ ముద్దుగుమ్మ. ఇప్పటికీ తన తల్లిదండ్రులను చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తోంది. ఇందుకు గల కారణాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కౌసల్య.

‘నిజం చెప్పాలంటే పెళ్లిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. సరైన వ్యక్తి.. జీవితంలోకి అడుగుపెడితే మ్యారేజ్ అనేది చాలా అందంగా ఉంటుంది. నేను కూడా పెళ్లి గురించి నేను ఎన్నో ఆలోచించాను. అది నాకు సెట్ కాదేమో అని మొదట్లో అనుకునేదాన్ని. నాకు తగ్గ వ్యక్తి దొరకడేమో అని భయపడ్డాను. కానీ ఆ తర్వాత అన్నీ ఆలోచనలను పక్కన పెట్టాను. ఎందుకో రిలేషన్ నాకు సెట్ కాదనిపించింది. దీంతో అమ్మనాన్నలతోనే ఉండాలని ఫిక్సయ్యాను. ఇప్పటికీ పెళ్లి ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఒక వేళ పెళ్లి చేసుకుంటే అత్తమామలతో ఎలా ఉంటానో అని కంగారుపడ్డాను. ఇలా ఆలోచనలు ఎక్కువయ్యేసరికి కొన్నాళ్లు పెళ్లి అనే దానికి దూరంగా ఉన్నాను. కొద్ది రోజుల క్రితం నేను అనారోగ్యం బారినపడ్డాను. బరువు కూడా పెరిగాను. దీనికి తోడు ఈ మధ్యన నేను చేసిన సినిమాలు పెద్దగ సంతృప్తి ఇవ్వలేదు. దీంతో అన్ని విషయాల నుంచి బ్రేక్ తీసుకున్నాను’ అని కౌసల్య చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
Follow Us
స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!