నా భార్య క్యాన్సర్‌తో చనిపోతే.. ఆస్పత్రి బిల్లులు, 11 రోజుల కార్యక్రమాల ఖర్చులన్నీ ఆ హీరోనే చూసుకున్నారు

సినీ నటుడు ఉత్తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్ నుంచి వచ్చిన మంచి నటుల్లో ఉత్తేజ్ కూడా ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ సత్తా చాటారు ఉత్తేజ్.

నా భార్య క్యాన్సర్‌తో చనిపోతే.. ఆస్పత్రి బిల్లులు, 11 రోజుల కార్యక్రమాల ఖర్చులన్నీ ఆ హీరోనే చూసుకున్నారు
Actor Uttej

Updated on: Jun 07, 2026 | 1:37 PM

1989లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాతోనే ఉత్తేజ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు. కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ సత్తా చాటారు ఉత్తేజ్. తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల్లోనూ నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అంతేకాదు కృష్ణవంశీ గులాబీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశాడు. ఇప్పటికీ నటుడిగా బిజీ బిజీగా ఉంటోన్న ఉత్తేజ్ జీవితంలో ఐదేళ్ల క్రితం (2021, సెప్టెంబర్ 13) ఒక తీరని విషాదం చోటు చేసుకుంది. అతని భార్య పద్మ క్యాన్సర్ తో కన్నుమూసింది. ఆ సమయంలో ఉత్తేజ్ తో పాటు అతని కూతురు మెగాస్టార్ చిరంజీవిని పట్టుకుని భోరున విలపించడం అందరినీ కలచివేసింది. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యారు ఉత్తేజ్. అలాగే కఠిన పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయం గురించి కూడా చెప్పారు.

‘ నా భార్యకు క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉందనే విషయాన్ని చెప్పడానికి మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్లాను. ఈ విషయం చెప్పగానే ఆయన ఓ మై గాడ్ అంటూ నన్ను హగ్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ ఏది కావాలంటే అది చేద్దాం నువ్వు ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. కానీ అప్పటికే క్యాన్సర్ మహమ్మారి బాగా ముదిరిపోయింది. పద్మ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. ఒకరోజు మార్నింగ్ తనకు బాగా సీరియస్ గా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. నాకు అప్పుడే అనిపించింది పద్మ మనకింకా లేదని. కొద్ది సేపటికి డాక్టర్లు కూడా బయటకు వచ్చి అదే విషయాన్ని చెప్పారు. నేను వెంటనే అన్నయ్య చిరంజీవికి ఫోన్ చేశాను. కన్నీళ్లతో ఇక లేదన్నయ్యా అని చెప్పాను. అప్పుడు షూటింగ్ లో ఉన్న ఆయన వెంటనే నీ పక్కన ఎవ్వరు ఉన్నారు అని అడిగారు. ఎవ్వరూ లేరన్నయ్య అని చెప్పగానే ‘నేను ఆస్పత్రికి వస్తున్నాను’ అని చెప్పి వెంటనే వచ్చేశారు. మా ఆస్పత్రి బిల్లుతో పాటు 11 రోజుల కార్యక్రమాలకు అయ్యే ఖర్చులన్నింటినీ అన్నయ్యే భరించారు’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఉత్తేజ్.

ఇవి కూడా చదవండి

చిరంజీవితో ఉత్తేజ్ కూతురు..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నయనం అనే ఒక మూవీలో కీలక పాత్ర పోషించాడు ఉత్తేజ్. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీలో రిలీజైంది. ఇక ఉత్తేజ్ కూతురు కూడా సోషల్ మీడియాలో యాక్టివ గా ఉంటోంది. తన తండ్రితో దిగిన ఫొటోలు, వీడయోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

భార్యతో ఉత్తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us