అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది

ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భక్తి, జీవిత తత్వం, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన తన ఆలోచనలను పంచుకున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి.. కొందరు హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు తనికెళ్ళ భరణి .

అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది
Tanikella Bharani

Updated on: May 17, 2026 | 12:33 PM

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి మెప్పించారు. అలాగే వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. విలన్ గా, సహాయక పాత్రల్లో మెప్పించిన భరణి, మిధునం సినిమాతో దర్శకుడిగానూ మెప్పించారు. కాగా గతంలో భరణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భక్తి, జీవిత సారం, తెలుగు సినిమా ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాటల్లో భక్తి అంటే కేవలం భయం కాదని, ప్రేమ, ఇష్టం ఉండాలని స్పష్టం చేశారు. శివుడి భక్తులు కష్టాలు పడతారనే వాదనను ఆయన కొట్టిపారేశారు. భక్తిని ప్రవచనకారులు, గ్రంథాలు సంక్లిష్టం చేశాయని, నిజమైన భక్తి అంటే “విభక్తము కానిది” అని వివరించారు. తిరుపతికి వెళ్ళడం నమ్మకం కంటే ఎక్కువగా భయం నుండే వస్తుందని, 99శాతం మందికి దేవుడంటే భయమేనని అన్నారు.నేను పరీక్షలో పాస్ అయితే గుండు కొట్టుకుంటాను” అని మొక్కుకునేవారు ఉన్నారే తప్ప, ముందుగానే గుండు కొట్టుకుని దేవుడిపై నమ్మకం ఉందని చెప్పేవారు ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

అలాగే సినిమాల గురించి మాట్లాడుతూ.. అరవై ఏళ్లుగా ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులు, టెక్నీషియన్లు ఉన్నప్పటికీ, తెలుగు సినిమాకు ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవడం, బెంగాలీ, మరాఠీ, కొంకిణి భాషా చిత్రాలకు రావడాన్ని ఆయన పేర్కొన్నారు. ఆ కసి తనను షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ప్రేరేపించిందని అన్నారు. స్టార్ డైరెక్టర్లు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్, వి.వి. వినాయక్ వంటివారు కూడా కేవలం కమర్షియల్ చిత్రాలు తీయడం పట్ల అసంతృప్తిగా ఉంటారని, కళాత్మక చిత్రాలు చేయాలని ఆరాటపడతారని చెప్పారు. చిరంజీవి గారికి కూడా బాలచందర్ వంటి దర్శకులతో కళాత్మక సినిమా చేయాలని ఉండేదని గుర్తు చేసుకున్నారు. అయితే, డబ్బులు పోతాయేమో, ఒకసారి డీ-గ్లామరైజ్ అయితే మళ్లీ చూడరేమో అనే భయం వారిని అడ్డుకుంటుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

రజనీకాంత్ అల్లుడు ధనుష్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ధనుష్ ఒక కమర్షియల్ హీరో అయ్యి కూడా, తక్కువ బడ్జెట్‌తో, చిన్న దర్శకులతో కళాత్మక, అవార్డు గెలుచుకున్న చిత్రాలు తీస్తున్న విధానాన్ని అభినందించారు. ఆయనకు రెండు చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. తన రెమ్యునరేషన్ తగ్గించుకొని చిన్న దర్శకులతో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు అని ప్రశంసించారు భరణి.  ఒకసారి ముందుకు వెళ్లినవారు మళ్లీ వెనక్కి వచ్చి కళాత్మక చిత్రాలు తీయడానికి సంశయిస్తారని, అది సినిమా ఇండస్ట్రీలో ఒక నాటకం లాంటిదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us