Rahul Ravindran: మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నాగార్జున డైరెక్టర్.. ఆ రీమేక్ లో ఛాన్స్..

అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు రాహుల్ రవీంద్రన్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేక పోయాడు.

Rahul Ravindran: మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నాగార్జున డైరెక్టర్.. ఆ రీమేక్ లో ఛాన్స్..
Rahul Ravindran

Updated on: Mar 25, 2021 | 8:08 AM

Rahul Ravindran: అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు రాహుల్ రవీంద్రన్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేక పోయాడు. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు సినిమాల్లో నటించాడు రాహుల్ రవీంద్రన్. అయినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. దాంతో దర్శకుడి అవతారమెత్తాడు రాహుల్ రవీంద్రన్. అక్కినేని హీరో సుశాంత్ తో ‘చిలసౌ’ అనే సినిమా సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సుశాంత్ కెరియర్ లోను మంచి సినిమాగా మిగిలిపోయిది ఈ సినిమా. ఆతర్వాత ఏకంగా కింగ్ నాగార్జున ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కనుంచుకున్నాడు రాహుల్ రవీంద్రన్.

నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ గా నిలించిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ మన్మధుడు 2 తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దాంతో ఇప్పుడు మళ్లీ హీరోగా మారాలనుకుంటున్నాడు ఈ కుర్ర దర్శకుడు కం హీరో. త్వరలో గీతాఆర్ట్స్ లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ లేదు. ఇప్పుడు ఒక మలయాళ సినిమా ను తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ రీమేక్ లో రాహుల్ హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అయ్యింది. అతి త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ankita Lokhande : స్టార్ హీరో నన్నురూమ్ లోకి రమ్మన్నాడు.. సంచలన విషయాలు తెలిపిన సుశాంత్ మాజీ ప్రియురాలు..

Adipurush update: ‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్‏డేట్ రానుందా ? ఆరోజున ప్రభాస్ లుక్ వచ్చే ఛాన్స్..

Sonu Sood: బిడ్డకు సోనూసూద్ పేరు పెట్టుకున్న ఖమ్మం దంపతులు.. నేరుగా కలిసిన రియల్ హీరో… ( వీడియో )

 

Loading...
Unable to load recommendations.
Follow Us