Tollywood: అమ్మ కొంగు చాటు ఈ చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు యాక్టర్.. ఎవరో కనిపెట్టారా..?

|

Feb 04, 2023 | 5:36 PM

ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు తెలుగునాట బిజీ యాక్టర్. విలక్షమైన పాత్రలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

Tollywood: అమ్మ కొంగు చాటు ఈ చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు యాక్టర్.. ఎవరో కనిపెట్టారా..?
Actor Childhood Photo
Follow us on

హీరోగానే ఉండాలని మడి కట్టుకుని కూర్చోవడం వేరు.. ఎలాంటి పాత్ర అయినా సరే.. చేసేందుకు సాహసించడం వేరు. సెకండ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవడం అంత ఈజీ అయితే కాదు. ఆ లిస్ట్‌లో నటుడు రానా ముందున్నాడు. పాత్ర నచ్చితే చాలు.. దాని నిడివి ఎంత..? పాటలు ఉన్నాయా..? ఫైట్స్ ఉన్నాయా..? అని చూడరు. సినిమాకు సైన్ చేసేస్తారు. ఇక స్వయంకృషితో ఎదిగిన నటుడు నవీన్ చంద్ర సైతం రానా రూట్‌లోనే పయనిస్తున్నాడు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు పాత్రాప్రాధాన్యం ఉన్న అవకాశాలు వస్తే.. వేరే హీరోల సినిమాల్లోనూ నటిస్తున్నాడు. విలన్‌గానూ సత్తా చాటుతున్నాడు. నవీన్ చంద్ర బళ్లారిలోని దేవి నగర్‌లో తెలుగు కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి KSRTC లో హెడ్ మెకానిక్. నవీన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. సినిమాల్లోకి రాకముందు మల్టీమీడియా యానిమేటర్‌గా పనిచేశాడు.

2006లోనే నటుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా అతడికి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేసినా.. ఫేట్ కలిసిరాలేదు. దీంతో నేను లోకల్ సినిమాలో నెగిటివ్ షేడ్ పాత్రలో నటించాడు. అప్పటి నుంచి అతడికి మంచి.. మంచి అవకాశాలు తలుపు తట్టాయి. అరవింద సమేత వీరరాఘవ మూవీలో నవీన్ చంద్ర రోల్ అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన భానుమతి & రామకృష్ణ మూవీతో మంచి క్లాసీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. నిన్న, మొన్న వచ్చిన వీరసింహారెడ్డి చిత్రంలోనూ అతడి పాత్ర బాగుంటుంది.

మొత్తంగా హీరోగా సక్సెస్ రానప్పుడు.. డిప్రెషన్‌లోకి వెళ్లలేదు ఈ యాక్టర్. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని.. ముందుకు సాగుతున్నాడు. తాజాగా అతడు తన మదర్‌తో చిన్నప్పుడు దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అందులోని బుడ్డోడు చిన్నప్పటి నవీన్ చంద్ర అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..