నేను ఇబ్బందుల్లో ఉంటే ఆ హీరో రూ. 45లక్షలు ఇచ్చాడు.. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్న మోహన్ బాబు

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇప్పటివరకు 500 కు పైగా సినిమాల్లో నటించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా, నిర్మాతగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తన నటనా ప్రతిభతో అభిమానుల చేత కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అని పిలిపించుకున్నారు

నేను ఇబ్బందుల్లో ఉంటే ఆ హీరో రూ. 45లక్షలు ఇచ్చాడు.. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్న మోహన్ బాబు
Mohanbabu

Updated on: Jan 29, 2026 | 10:03 AM

కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. ప్రస్తుతం సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే ఆయన కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. తనదైన డైలాగ్ డెలివరీతో, యాక్షన్ తో 50ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు మోహన్ బాబు. ఎన్నో వైవిద్యమైన పాత్రలు చేసి మెప్పించారు, ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశారు మోహన్ బాబు. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. ఇటీవలే ఆయన పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన మోహన్ బాబు ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు మరోసారి విలన్ గా అలరించడానికి రెడీ అయ్యారు. ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు పాత్ర నెగిటివ్ యాంగిల్ లోనే కాదు సినిమాలో కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.

రెండే రెండు సినిమాలు.. ఒకటి హిట్ రెండోది డిజాస్టర్..! ఒకోక్క మూవీకి రూ.7కోట్లు అందుకుంటున్న బ్యూటీ

కాగా గతంలో మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మోహన్ బాబు, తన చిరకాల మిత్రుడు, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తనకున్న స్నేహబంధాన్ని, అలాగే తమ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన పెదరాయుడు చిత్రం విజయాన్ని గుర్తుచేసుకున్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. 1995లో ఆయన నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారట. ఈ పరిస్థితిని రజినీకాంత్ తెలుసుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండానే నేరుగా రైలులో రాజమండ్రికి చేరుకున్నారని తెలిపారు మోహన్ బాబు. తన స్నేహితుడు వచ్చాడని మోహన్ బాబు ఆయన్ను కలుసుకోవడానికి వెళ్లారట. అక్కడ రజినీకాంత్ మోహన్ బాబును తనతో కార్లో ఎక్కించుకుని ఒక హోటల్‌కు తీసుకెళ్లి, ఒక ప్యాకెట్ ఇచ్చారని మోహన్ బాబు తెలిపారు.

నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడా..! మూగ అమ్మాయి సినిమాల్లోకా అని అవమానించారు

అది తెరిచి చూడగా, అందులో రూ.45 లక్షల డబ్బు ఉంది. ఈ ఊహించని సహాయం గురించి మోహన్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, రజినీకాంత్ నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు. నీ నెక్స్ట్ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. సినిమా విడుదలైన తర్వాత నాకు తిరిగి ఇచ్చేయ్ అని ధైర్యం చెప్పారు. ఈ సంఘటన రజినీకాంత్ ఉదార స్వభావాన్ని, స్నేహం పట్ల ఆయన నిబద్ధతను తెలియజేస్తుందని మోహన్ బాబు అన్నారు. తమ స్నేహంలో ఎలాంటి ఆశలు, అంచనాలు లేవని, కేవలం ఆప్యాయత, ప్రేమ మాత్రమే ఉన్నాయని, ఇది సినిమా పరిశ్రమలో చాలా అరుదని మోహన్ బాబు అన్నారు.

ఇవి కూడా చదవండి

అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. ఇప్పుడు ఇలా..! ఈ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గుర్తుందా..?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..