ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన మనవళ్లు, స్టార్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు చేరుకుని అంజలి ఘటించారు. తాతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇక తారక్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చిన సమయంలో ఫ్యాన్స్ అంతా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభలు, ర్యాలీల్లో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవ్వాలనే స్లోగల్స్ రెగ్యులర్‌గా వినిపించేవే. ఇప్పుడు వర్థంతి వేళ కూడా తాతకు వారసుడిగా తారక్‌ను చూడాలని కోరుకుంటూ ఫ్యాన్స్ జైకొట్టారు.
నందమూరి తారక రామారావు 27వ వర్థంతి సందర్భంగా ఇవాళ పలు సేవా కార్యక్రమాల్ని చేపట్టారు అభిమానులు. యుగపురుషుడు ఎన్టీఆర్ అంటూ అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌లో ఎన్టీఆర్ కు నివాళి అర్పించనున్నారు చంద్రబాబు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..