
తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆర్జీవీ శిష్యుడిగా పరిచయమైనా అజయ్ తొలి సినిమా ఆర్ ఎక్స్ 100తోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. లవ్ స్టోరీలో సరికొత్త కథనంతో ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాయల్ అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్, సిద్దార్థ్ తో కలిసి మహా సముద్రం అనే సినిమా చేశాడు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా దారుణంగా నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో మరోసారి పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మంగళవారం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఇక ఈ సినిమా హారర్ నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది. స్వాతి – సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించనున్నారు.
Here’s the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha ?
It’s a PAN-SOUTH INDIAN movie?
‘KANTARA’ fame @AJANEESHB is scoring ? to this never-seen-before film ?@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023