Tollywood : 9 ఏళ్లల్లో ఒక్క హిట్టు లేదు.. కానీ ఒక్క సినిమాకు రెమ్యునరేషన్ రూ.40 కోట్లు.. క్రేజ్ చూస్తే ఫ్యూజుల్ అవుట్..

సినీరంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆర్మీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. తొమ్మిదేళ్లల్లో ఒక్క హిట్టు కూడా లేదు. కానీ ఒక్క సినిమాకు రెమ్యునరేషన్ రూ.40 కోట్లు తీసుకుంటుంది.

Tollywood : 9 ఏళ్లల్లో ఒక్క హిట్టు లేదు.. కానీ ఒక్క సినిమాకు రెమ్యునరేషన్ రూ.40 కోట్లు.. క్రేజ్ చూస్తే ఫ్యూజుల్ అవుట్..
Priyanka Chopra

Updated on: May 25, 2025 | 10:39 AM

ప్రస్తుతం సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. పాన్ ఇండియా లెవల్లో అత్యంత డిమాండ్ ఉన్న బ్యూటీ. హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరోలకు పోటీగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. దాదాపు తొమ్మిదేళ్లల్లో ఆమె ఖాతాలో ఒక్క హిట్టు పడలేదు. కానీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.40 కోట్లు తీసుకుంటుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రియాంక చోప్రా. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రియాంక చోప్రా 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత 2002వ సంవత్సరంలో విడుదలైన థమిజన్ సినిమాతో తమిళరంగంలోకి అడుగుపెట్టింది.

ఇక మరుసటి ఏడాది 2003లో విడుదలైన ద హీరో : లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అందాజ్, షాది కరోగి వంటి చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకుంది.తెలుగులో రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జంజీర్ చిత్రంలోనూ నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది ప్రియాంక. ఆమె చివరగా బాజీరావ్ మస్తానీ చిత్రంలో కనిపించింది. 2019లో ద స్కై ఈజ్ పింక్ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత మరో హిందీ సినిమా చేయలేదు.

అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే లాస్ ఏంజెల్స్ కు షిఫ్ట్ అయ్యింది . అక్కడే హాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు రూ.21 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న ప్రియాంక.. ఇటీవల సిటాడెల్ వెబ్ సిరీస్ కు రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB 29 చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ కోసం భారీ పారితోషికం తీసుకుంటుందని టాక్.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..