Actress: 16 ఏళ్లకే తోపు హీరోయిన్.. రెండుసార్లు విడాకులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాయ్యేస్ట్ రెమ్యునరేషన్..

12 ఏళ్లకే నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుని 20 ఏళ్ల వయసులోనే తల్లైంది. వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. వ్యక్తిగత జీవితంలో మాత్రం సంతోషంగా గడపలేదు. చివరకు రెండుసార్లు విడాకులు తీసుకుని ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress: 16 ఏళ్లకే తోపు హీరోయిన్.. రెండుసార్లు విడాకులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాయ్యేస్ట్ రెమ్యునరేషన్..
Shweta Tiwari

Updated on: Jun 20, 2025 | 9:44 PM

సాధారణంగా బుల్లితెర నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. అలాగే చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ డమ్ సంపాదించుకున్న స్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి సైతం కేవలం 12 ఏళ్ల వయసులోనే నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఆమె బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఈ నటి 20 సంవత్సరాల వయసులో తల్లి అయ్యింది. భర్తతో విడాకులు తీసుకుని తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడి తోటి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ బంధం సైతం ఎక్కువ రోజులు నిలవలేదు. దీంతో మరోసారి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తుంది. ఆమె ఎవరో తెలుసా.. ? ఐకానిక్ పాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన శ్వేతా తివారీ.

16 సంవత్సరాల వయసులో టీవీ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది శ్వేతా తివారీ. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. 1999లో దూరదర్శన్ సీరియల్ కలీరీన్ ద్వారా వినోద పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కసౌతి జిందగీ కే తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. శ్వేత 18 సంవత్సరాల వయసులో 1998లో రాజా చౌదరిని వివాహం చేసుకుంది. 20 ఏళ్ల వయసులోనే తల్లి అయ్యింది. ఈ దంపతులకు పాప పాలక్ తివారీ జన్మించింది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత తన తోటి నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకుంది. వీరికి బాబు జన్మించాడు. కానీ ఈ బంధం సైతం ఎక్కువ రోజులు నిలవలేదు.తన భర్త తనను వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయించింది. దీంతో వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం శ్వేతా తివారీ బుల్లితెరపై టాప్ హీరోయిన్. అంతేకాకుండా టీవీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటి.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..