AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ప్రభాస్, అల్లు అర్జున్‏తో సినిమాలు.. ఇప్పుడు యూకే కంపెనీలో డైరెక్టర్.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న హీరోయిన్..

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు రావడం అంత సులభమైన విషయం కాదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకటి రెండు చిత్రాలతోనే స్టార్ డమ్ అందుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పేసి పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ సైతం అదే పని చేస్తున్నారు. సినిమాలకు దూరమై సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతున్నారు.

Tollywood : ప్రభాస్, అల్లు అర్జున్‏తో సినిమాలు.. ఇప్పుడు యూకే కంపెనీలో డైరెక్టర్.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న హీరోయిన్..
Deeksha Seth
Rajitha Chanti
|

Updated on: Jul 08, 2026 | 11:16 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్. ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. దీంతో ఆమె వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతుంది. ఆమె ఇప్పుడు ఇతర నటీనటులకు భిన్నంగా తన కెరీర్ ఎంచుకుంది. ఆమె మరెవరో కాదు.. దీక్షా సేత్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2010లో అల్లు అర్జున్, మంచు మనోజ్ కలిసి నటించిన వేదం చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన రెబల్ చిత్రంలో కనిపించింది. అలాగే రవితేజతోనూ పలు చిత్రాల్లో నటించి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. దీక్ష నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె తండ్రికి కోల్‌కతా, చెన్నై, ముంబై, కాఠ్మండు, గుజరాత్, రాజస్థాన్ వంటి నగరాల్లో కార్పొరేట్ బదిలీల కారణంగా ఆమె బాల్యం ఆయన వెంటే గడిచిపోయింది. నిరంతర ప్రయాణాలు మారుతున్న వాతావరణాలకు అలవాటుపడింది. కాలేజీ నాటికి, ఆమె సముద్ర పురావస్తు శాస్త్రాన్ని చదవాలనుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..

సముద్ర గర్భం, పురాతన ఓడల శిధిలాలు, నీటి అడుగున చరిత్ర పట్ల ఆమెకు అమితమైన ఆసక్తి ఉండేది.ఒక ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో స్కౌట్ ఆమెను గమనించడంతో ఆమె జీవితం మారిపోయింది. దీక్ష ఒక ఫ్యాషన్ పోటీలో ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్‌లో ఒక మోడలింగ్ అసైన్‌మెంట్ సమయంలో, దర్శకుడు కృష్ణ ఆమెను చూసి, తన రాబోయే సినిమాలో ఒక పాత్రకు ఆమె సరిపోతుందని భావించారు. ఆ సినిమానే ‘వేదం’. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. ఆ తర్వాత రవితేజ జోడిగా మిరపకాయ్ చిత్రంలో నటించింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె..వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న దీక్షా.. ఇప్పుడు కార్పొరేట్ రంగంలో దూసుకుపోతుంది. IESE బిజినెస్ స్కూల్‌లో MBA పూర్తి చేసిన దీక్షా సేత్.. ప్రస్తుతం మీడియా, బ్రాండింగ్ రంగాల్లో తనకున్న దశాబ్దాల అనుభవాన్ని కార్పోరేట్ రంగంలోకి మళ్లిస్తూ.. యూకే ఆధారిత గేమింగ్ సంస్థలో బిజినెస్ డెవలప్‌మెంట్ , స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు నెలకు లక్షల్లో సాలరీ అందుకుంటూ సినిమాలుక దూరంగా గడుపుతున్నారు. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

దీక్షా సేత్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Deeksha Seth (@deeksha721)

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Follow Us