
ఎయిర్‌పోర్టులో మన స్టార్లు ముంబై ఫ్లైట్ ఎక్కితే ప్రమోషన్ వచ్చేసినట్టేననుకునే రోజులు ఇప్పుడు లేవు. హైదరాబాద్‌లో ల్యాండ్ కావడాన్ని నార్త్ స్టార్లు ప్రెస్టీజియస్‌గా ఫీలయ్యే టైమ్ వచ్చేసింది. అందుకే, ఇప్పుడు మన టాప్ హీరోల సినిమాల్లో విలన్ రోల్స్ అన్నీ హిందీ హీరోలతో ఫిల్ అవుతున్నాయి. శంకర్ డైరక్షన్‌లో రజనీకాంత్ 2.0ని అనౌన్స్ చేసినప్పుడు వచ్చిన క్రేజ్ కన్నా, ఈ సినిమాలో నెగటివ్ రోల్‌లో అక్షయ్‌కనిపిస్తారనే మాట వైరల్ అయినప్పుడు కనిపించిన బజ్ వేరే లెవల్. మన హీరోల సినిమాల్లో, నార్త్ హీరోలు విలన్లుగా కనిపిస్తే ఎలాంటి క్రేజ్ వస్తుందో చెప్పిన సినిమా రోబో 2.ఓ.
#LEO Raging In 62 Days🦁🔥 @actorvijay pic.twitter.com/eV2G4cwMjn
— LEO Movie (@LeoMovie2023) August 18, 2023
BHAIRA. #Devara pic.twitter.com/8S8VmpMTzx
— Devara (@DevaraMovie) August 16, 2023
అటు భగవంత్ కేసరిలో బాలయ్యతో తలపడటానికి రెడీ అయ్యారు అర్జున్ రామ్ పాల్. ఒకప్పుడు తెలుగు సినిమాలను తక్కువగా చూసిన బాలీవుడ్ స్టార్లు, ఇప్పుడు మన సినిమాల్లో నార్త్ విలనిజాన్ని పోటాపోటీగా పండిస్తున్నారు.