
టాలీవుడ్ లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే మన తెలుగులో భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో ముందు చెప్పుకోవాల్సింది ప్రభాస్ గురించే.. ప్రభాస్ ప్రస్తుతం ఒకొక్క సినిమాకు 150 కోట్ల వరకు అందుకుంటున్నారని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఒకొక్క సినిమాలు 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. మహేష్ ఒకొక్క సినిమాకు సుమారు 55 కోట్లు తీసుకుంటున్నారని టాక్. అలాగే రాజమౌళి తో చేస్తున్న సినిమాకు 80 కోట్ల వరకు అందుకోనున్నారట

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోనున్నారని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకొక్క సినిమాకు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ ఒకొక్క సినిమాకు 50 కోట్లకు అందుకుంటున్నారట.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకోసం బన్నీ 80 కోట్లు తీసుకుంటున్నారని టాక్.