
బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది గత నాలుగు సీజన్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు సీజన్స్ 7 కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీజన్ 7 కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయ్యింది. త్వరలోనే అలరించాడని బిగ్ బాస్ 7 రెడీ అవుతున్న క్రమంలో ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్ళే అని కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 లో చాలా మంది మనకు తెలిసిన వల్లే పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లు ఇవే..
కార్తీకదీపం ఫేమ్ శోభాశెట్టి, అందాల యాంకర్ విష్ణు ప్రియా , సాయి రోనాక్ , సిద్దార్థ్ వర్మ, సాకేత్ కొమండూరి ,ఢీ పండు, నిఖిల్,మహేష్ బాబు కాళిదాసు, జబర్దస్త్ అప్పారావు, మోహన శోభరాజు, అమర్ దీప్ అతడి భార్య తేజేస్విని ఈ సీజన్ లో పాల్గొంటున్నారని టాక్..
ఇక ఈ సీజన్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం లేదు అని మొనీమధ్య టాక్ వినిపించింది. నాలుగు సీజన్స్ కు వరుసగా హోస్ట్ చేసిన నాగ్ ఈసారి బ్రేక్ తీసుకుంటున్నారని.. ఆయన స్థానంలో మరో యంగ్ హీరో హోస్ట్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా నాగ్ న్యూ లుక్ వైరల్ కావడంతో ఆయన ఇదే లుక్ లో బిగ్ బాస్ సీజన్ 7 ను హోస్ట్ చేయనున్నారని అంటున్నారు. త్వరలోనే దేనికి పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.