Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి జబర్దస్త్ నటుడు.. ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా

ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ షో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ ఉండనుందని తెలుస్తోంది.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి జబర్దస్త్ నటుడు.. ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా
Bigg Boss 10

Updated on: Aug 09, 2026 | 10:05 AM

బిగ్ బాస్ సీజన్ 10 కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలొనే బిగ్ బాస్ 10 ప్రారంభంకానుంది. ఈసారి మరింత ఆసక్తికరంగా ఉండేలా బిగ్ బాస్ గేమ్ షోను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈసారి కూడా బిగ్ బాస్ గేమ్ షోకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈసారి కూడా సామాన్యులకు పెద్ద పీట వేస్తూ కామనర్సకు చాన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అగ్నిపరీక్ష సీజన్ కూడా మొదలు కానుంది. అగ్నిపరీక్ష 2  త్వరలోనే మొదలుకానుంది. కొందరు సామాన్యులను సెలక్ట్ చేసి వారిని హౌస్ లోకి పంపనున్నారు. ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ 10కు ఆడిషన్స్ ఇస్తున్నారు. కొందరు సెలక్ట్ అయ్యారని కూడా తెలుస్తుంది. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి కొందరు ఎంపిక అయ్యారని టాక్ వినిపిస్తుంది.

కొంతమంది పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే కొంతమంది కన్ఫర్మ్ అయ్యారని కూడా టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ అలియాస్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణీ.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు, యూట్యూబర్ల పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా ఇప్పుడు జబర్దస్త్ నటుడు రామ్ ప్రసాద్ పేరు కాస్త ఎక్కుగానే వినిపిస్తుంది. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తుంపు తెచ్చుకున్నారు రామ్ ప్రసాద్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రామ్ ప్రసాద్ కొన్ని సినిమాల్లోనూ నటించాడు. ఇక ఇప్పుడు రామ్ ప్రసాద్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ సంప్రదించగా రామ్ ప్రసాద్ ఓకే చెప్పాడని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. రామ్ ప్రసాద్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎంటర్టైన్మెంట్ డబుల్ అవ్వడం ఖాయం.. చూడాలి మరి ఏం జరుగుతుందో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us