
మైథలాజికల్, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో రాబోతోన్న ‘వృషభ’ చిత్రాన్ని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ ముంబైలో ముగిసింది. ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో సెట్‌లో చిత్రయూనిట్ అంతా కూడా సందడి చేశారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేయనున్నారు.
విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ ఇలా అన్ని పనుల్ని ప్రారంభించబోతోన్నారు. ఈ మూవీని మలయాళం, తెలుగు భాషల్లో తెరకెక్కించారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.
లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఈ సినిమా ఉంటుందని మేకర్లు తెలిపారు. ప్రతీ ఒక్క సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయని అంటున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో మరుపురాని చిత్రంగా వృషభ నిలుస్తుందని మేకర్లు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. మున్ముందు మరింతగా ప్రమోషనల్ కంటెంట్‌ను వదిలి సినిమాపై ఆసక్తిని పెంచబోతోన్నారు. వృషభ జర్నీ ఇప్పుడే మొదలైందని, ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. అంతకు మించేలా ఉంటుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.