
దళపతి విజయ్ సినిమా వస్తుందంటే ఆయన ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండదు. తమిళ్ తో పాటు తెలుగులోనూ విజయ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తుపాకీ సినిమానుంచి విజయ్ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అవుతున్నాయి. విజయ్ నటించిన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అవలీలగా వందకోట్ల మార్క్ ను దాటేస్తుంటాయి. ఇటీవల వచ్చిన వారసుడు సినిమాతో హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు లియోగా అలరించనున్నాడు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లోకేష్ చేసిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు లియో సినిమాకు సంబంధం ఉంటుంది తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్ప్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. బ్లడీ స్వీట్ అంటూ సింగిల్ డైలాగ్ తో ఈ గ్లిమ్ప్స్ సినిమా పై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేసింది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత విజయ్, త్రిష కాంబినేషన్ లో సినిమా వస్తుంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం విజయ్..త్రిష..గౌతమ్ మీనన్ తో పాటు దాదాపు 500 మందిపై షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. మైనస్ 12 డిగ్రీల చలిలో షూటింగ్ చేస్తున్నారట లియో టీమ్. చలి చంపేస్తోన్నా షూటింగ్ మాత్రం ఆపడం లేదట.. దీన్ని బట్టే అర్ధమవుతోంది.. లియో టీమ్ కు సినిమా పై సినిమాపై తముకున్న అభిమానం . ఇక ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.