Thalapathy Vijay: కోలీవుడ్‌లోనే కాకుండా.. టాలీవుడ్‌లో కూడ మంచి క్రేజున్న స్టార్ హీరో విజయ్. తమిళ ప్రజలు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకునే ఈ స్టార్ హీరో ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో నటించనున్నారు. అందుకోసం భారీగా రెమ్యూనరేషన్‌ను కూడా అందుకోనున్నారు. ఇప్పుడిదే విషయం ఇటు టాలీవుడ్‌లోనూ… అటు కోలీవుడ్‌లోనూ వైరల్‌గా మారింది. ఇటీవల మాస్టర్ సినిమాతో సంచలన విజయాన్ని దళపతి. వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు విజయ్. మాస్టర్ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో విజయ్ కు ప్రత్యర్థిగా మరో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమాను నెల్సన్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మాస్టర్ సినిమాతో తెలుగులోనూ మంచి హిట్టు కొట్టిన విజయ్.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో తెలుగులో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై.. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో.. తమిళ తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారట.
అయితే అందుకోసం హీరో విజయ్‌కు భారీగా రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేశారట దిల్ రాజు. దాదాపు 90 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్దంగా పడ్డారట ఈ స్టార్ ప్రొడ్యూసర్. అంతేకాదు ఈ సినిమాకు డేట్లు వెంటనే ఇచ్చేలా కూడా మాట్లాడుతున్నారట. నిజానికి హీరో విజయ్ తమిళ్లో ఒక్కో సినిమాకు 80కోట్ల వరకు తీసుకుంటారు. అయితే ఇక్కడ చేసే తొలి సినిమాకే ఏకంగా 90 కోట్ల ఆఫర్‌ను పట్టేసి.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారారు.
మరిన్ని ఇక్కడ చదవండి :