Thalapathy Vijay: జననాయగన్ టీమ్ విందులో విజయ్ ఎమోషనల్.. సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకోని భావోద్వేగానికి లోనైన దళపతి

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ హీరో సినిమా వచ్చిందంటే చాలు తమిళనాడులోని థియేటర్లలలో పండగే. తమిళంతోపాటు విజయ్ సినిమాలను తెలుగులోకి డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈ హీరోకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Thalapathy Vijay: జననాయగన్ టీమ్ విందులో విజయ్ ఎమోషనల్.. సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకోని భావోద్వేగానికి లోనైన దళపతి
Thalapathy Vijay

Updated on: Jun 06, 2025 | 7:56 PM

దళపతి విజయ్ 69వ చిత్రానికి ‘జననాయగన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇదే తన చివరి సినిమా అని విజయ్ స్వయంగా ప్రకటించాడు. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయ్ త్వరలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. ఇదిలా ఉంటే విజయ్ చివరి చిత్రాన్ని కర్ణాటక కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. విజ‌య్ ఆఖ‌రి మూవీని అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాల‌ని కెవిఎన్ నిర్మాణ సంస్థ నిర్ణ‌యించింది. ‘జననాయగన్’ సినిమా కోసం కెవిఎన్‌ వెంకట్‌ కె నారాయణ్‌ భారీ బడ్జెట్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. భారీ సెట్లు, భారీ వీఎఫ్‌ఎక్స్‌ మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా చిత్రీకరణ జరుపుకుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా జననాయగన్ సినిమా టీమ్ ఓ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో విజయ్ ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది. జననాయగం చిత్రం షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా జరిగిన విందు కార్యక్రమంలో తమిళ సూపర్‌స్టార్ విజయ్ భావోద్వేగానికి లోనయ్యారని సమాచారం. ఈ చిత్రం విజయ్‌ నట జీవితంలో చివరి చిత్రం. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ తన అభిమానులు, సినీ పరిశ్రమలోని సహచరులతో కలిసి గడిపిన క్షణాలు తలుచుకొని ఎమోషనల్‌ అయ్యారని తెలుస్తుంది.

ఈ వేడుకలో ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుని, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. ఈ చిత్రం హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్ వంటి తారాగణంనటిస్తున్నారు. జననాయగన్ రాజకీయ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. విజయ్‌ రాజకీయ ప్రవేశానికి ముందు ఆయన అభిమానులకు ఒక ముఖ్యమైన సినీ అనుభవంగా నిలిచిపోనుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్డేట్స్ ను అందించనున్నారు. మరి ఈ సినిమా విజయ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి