CCL 2023: 30 బంతుల్లో 91 పరుగులు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపిన తెలుగు వారియర్స్‌ సారథి.. కేరళపై ఘన విజయం

|

Feb 20, 2023 | 4:51 AM

Celebrity Cricket League 2023: సీసీఎల్‌లో తెలుగు వారియర్స్‌ దుమ్మురేపింది. కేరళ స్ట్రైకర్స్‌పై 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సెలబ్రిటీల తళుకుల మధ్య మ్యాచ్‌ ఆద్యంత ఆసక్తిగా కొనసాగింది.

CCL 2023: 30 బంతుల్లో 91 పరుగులు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపిన తెలుగు వారియర్స్‌ సారథి.. కేరళపై ఘన విజయం
Kerala Strikers Vs Telugu Warriors
Follow us on

Kerala Strikers vs Telugu Warriors: సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను తలపిస్తోంది. ఓ వైపు క్రికెట్‌ – మరోవైపు సినీ గ్లామర్‌ కలిసి ఫ్యాన్స్‌కి వినోదం పంచుతున్నారు. తెలుగు వారియర్స్‌ టీమ్‌ సీసీఎల్‌లో అదరగొడుతోంది. తాజాగా కేరళ స్ట్రైక్కర్స్‌ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌ దుమ్మురేపింది. కేరళ స్ట్రైక్కర్స్‌ మొదట టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ దిగిన తెలుగు వారియర్స్‌ కెప్టెన్‌ అక్కినేని అఖిల్‌, కేరళ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. అటు మరో ఓపెనర్‌ ప్రిన్స్‌ కూడా 23 బంతుల్లో 45 పరుగులు చేశాడు. 10 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి తెలుగు వారియర్స్‌ జట్టు 154 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కి దిగిన కేరళ స్ట్రైక్కర్స్‌ మొదట ధాటిగానే ఆడింది. ఓపెనర్లు సిద్ధార్థ్‌ మీనన్‌ 20, రాజీవ్‌ పిల్లాయ్‌ 38 పరుగులతో చెలరేగిపోయారు. కెప్టెన్‌ ఉన్ని ముకుందన్‌ 23 పరుగులు చేశారు. ఐతే తెలుగు వారియర్స్‌ బౌలర్‌ తమన్‌ విజృంభించడంతో కేరళ స్ట్రైక్కర్స్‌ చివరకు 6 వికెట్లు కోల్పోయి, కేవలం 105 పరుగులు చేసింది.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు తారలు తళుక్కుమన్నారు. హీరో వెంకటేష్‌ సందడి చేశారు. అక్కినేని అఖిల్‌ ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిపోయినప్పుడు హీరోయిన్లు కేకలు,ఈలలతో సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ డే 2లోని 4వ మ్యాచ్‌లో ఈరోజు రాయ్‌పూర్‌లో సోనూ సూద్ పంజాబ్ డి షేర్ వర్సెస్ మనోజ్ తివారీ నేతృత్వంలోని భోజ్‌పురి దబాంగ్స్ తలపడ్డాయి. పంజాబ్ డి షేర్ భోజ్‌పురి దబాంగ్స్‌పై ఓటమిని ఎదుర్కొంది. భోపూరి దబాంగ్స్‌పై 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2023లో 8 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు.. హైదరాబాద్‌, జైపూర్‌, రాయ్‌పూర్‌, జోధ్‌పూర్‌, బెంగళూరు, తిరువనంతపురంలో జరుగుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..