అతడు టాలెండ్ ఉన్న ఫెల్లో.. గాలివాటంలాగా అని పాట అందుకున్నాడంటే.. శ్రోతలు మైమరిచిపోవల్సిందే. అతడి గాత్రంలో అంత డెప్త్ ఉంటుంది. టాలెంట్ కాదు.. మనసు కూడా చాలామంచిదని ఇన్నాళ్లూ అనుకున్నాం.. అతడు చేస్తున్న సర్వీసెస్ చూసి. కానీ అసలు విషయం తెలిసి బుర్ర గిర్రున తిరిగింది. సామాజిక సేవ చేయడాన్ని ఎవ్వరూ తప్పుబట్టరు!. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటే కాదనేదెవ్వరు?. పేద పిల్లలను చదివిస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు. కానీ, ఇవేమీ చేయకుండానే చేసినట్టు బిల్డప్ ఇస్తూ చీటింగ్ చేస్తే. సరిగమప సింగర్ యశస్వి కొండేపూడి అదే చేశాడు. తనదికాని సంస్థను తనదని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు యశస్వి. ఎన్జీవో సంస్థను నడుపుతూ ఎంతోమంది అనాథ పిల్లల బాగోగులు చూసుకుంటున్నట్టు కలరింగ్ ఇస్తూ అసలు ఓనర్‌కే ఝలక్ ఇచ్చాడు.
కాకినాడలో నవసేన ఫౌండేషన్ పేరుతో ఓ ఎన్జీవో సంస్థ నడుస్తోంది. సుమారు యాభై అరవై మంది అనాథ పిల్లలకు ఆ సంస్థ షెల్టర్ కల్పించి చదివిస్తోంది. అయితే, ఆ సంస్థ తనదే అంటూ కలరింగ్ ఇచ్చాడు సింగర్ యశస్వి. నవసేన ఫౌండేషన్ ఉంటోన్న పిల్లలతో ఫొటోలు దిగి… అది తానే నడుపుతున్నట్లు ఓ సింగింగ్ కాంపిటీషన్‌లో సానుభూతి, ఓట్ల కోసం వినియోగించుకున్నాడు.
సింగర్ యశస్వి మోసాన్ని బయటపెట్టారు కాకినాడ నవసేన ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్. చీమలు పెట్టిన పుట్టలో పాములు చొరబడినట్టు తన సంస్థను తనదిగా చెప్పుకుంటూ యశస్వి మమ్మల్ని మోసం చేశాడని అంటున్నారు. గత ఐదేళ్లుగా తన సొంత డబ్బుతోనే 56మంది పిల్లలను పోషిస్తూ చదివిస్తున్నానంటున్నారు ఫరా. నవసేన ఫౌండేషన్‌కు ఏ సెలెబ్రిటీ నుంచి సహకారం లేదంటున్నారు ఫరా. కానీ, తమ సంస్థ పేరును వాడుకోవడమే కాకుండా, తానే నడుపుతున్నట్లు చెప్పుకుంటోన్న యశస్విపై చర్యలు తీసుకోవాలంటున్నారు ఫరా.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.