Folk Song : ఏముంది మావ పాట.. విన్నా కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. కుర్రాళ్లు ఫిదా అయిపోతున్న సాంగ్..

సాధారణంగా యూట్యూబ్, సోషల్ మీడియా ప్రపంచంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చమైన పల్లె పాటలు.. ఆకట్టుకునే సాహిత్యంతో జనాలను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా కుర్రాళ్లను ఈ ఫోక్ సాంగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ రాము రాథోడ్ ఆడిపాడిన ఓ పాట ఇప్పుడు తెగ వైరలవుతుంది.

Folk Song : ఏముంది మావ పాట.. విన్నా కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. కుర్రాళ్లు ఫిదా అయిపోతున్న సాంగ్..
Sikka Theeru Song

Updated on: Jun 06, 2026 | 11:25 AM

ఇటీవలి కాలంలో యూట్యూ్బ్ లో తెలంగాణ పల్లె పాటలు సృష్టిస్తున్న సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ప్రైవేట్ జానపద గీతాలకు సరికొత్త క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒక ఫోక్ సాంగ్ నెట్టంట సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటివరకు 60 మిలియన్ వ్యూస్ అందుకుని దూసుకుపోతుంది. బిగ్ బాస్ ఫేస్, ఫోక్ సింగర్ రాము రాథోడ్ మరోసారి తన తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పాట పేరు “చుక్క తీరు” (Sukka Theeru). ఈ ఫోక్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ పాట, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాటలో ప్రముఖ ఫోక్ ఆర్టిస్టులు రాము రాథోడ్, భ్రమరాంబిక టుటికా ప్రధాన జంటగా నటించారు.

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

“చుక్క తీరు” సాంగ్ పక్కా పల్లెటూరి వాతావరణంలో, ఒక అందమైన దేవాలయం, గ్రామీణ నేపథ్యంలో లవ్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. కళ్యాణ్ కీస్ అందించిన ఆకట్టుకునే ట్యూన్, బిట్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినేలా చేస్తున్నాయి. ఈ పాటకు ప్రముఖ సింగర్స్ వాగ్దేవి, హనుమంత్ యాదవ్ తమ గాత్రాన్ని అందించారు. గ్రామీణ యాసతో, స్వచ్ఛమైన జానపద శైలిలో సాగే వీరి గానం వినే కొద్దీ అద్భుతంగా అనిపిస్తుంది. కమల్ ఇస్లావత్ అందించిన లిరిక్స్ పల్లెటూరి ప్రేమికుల మధ్య ఉండే భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబించాయి.

ఎక్కువమంది చదివినవి : Raghavendra Rao : అది గొప్ప పాట.. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన సాంగ్.. రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..

ఈ మ్యూజిక్ వీడియోకు ప్రధాన ఆకర్షణ రాము రాథోడ్, భ్రమరాంబికల నటన. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ స్క్రీన్‌పై చాలా అద్భుతంగా పండింది. భ్రమరాంబిక తన అందమైన హావభావాలు, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా.. రాము రాథోడ్ తన స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో మెప్పించాడు. శ్రీనాథ్ అల్డి నేతృత్వంలో సమకూరిన కొరియోగ్రఫీ, రాజ్ లోహిత్ క్రియేటివ్ కాన్సెప్ట్ ఈ పాటను విజువల్‌గా మరింత రిచ్‌గా మార్చాయి. వందలాది మంది కంటెంట్ క్రియేటర్లు ఈ పాటకు రీల్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్న “చుక్క తీరు” సాంగ్ నెట్టింట మరో బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

సుక్క తీరు ఫోక్ సాంగ్..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us