Pavala Shyamala : దీనస్థితిలో టాలీవుడ్ కమెడియన్.. అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో నటి పావల శ్యామల..

తెలుగు చలన చిత్రపరిశ్రలో దాదాపు 300లకు పైగా సినిమాల్లో సహాయ నటిగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ పావల శ్యామల. కానీ కొన్నాళ్లుగా ఆమె దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో కనిపించారు.

Pavala Shyamala : దీనస్థితిలో టాలీవుడ్ కమెడియన్.. అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో నటి పావల శ్యామల..
Pavala Shyamala

Updated on: May 16, 2026 | 9:41 AM

సినీ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతోపాటు.. సరైన ఆదాయం, ఆధారం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పావల శ్యామలకు ఆర్థిక సాయం అందించారు. ఇటీవల గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళింది. చికిత్స తర్వాత అర్ధరాత్రి సమయంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను కూకట్పల్లి వై జంక్షన్ వద్ద వదిలి వెళ్లినట్లు సమాచారం. ఫుట్ పాత్ పై బిక్కు బిక్కుమంటూ చూస్తున్న ఆమెను అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. అనంతరం స్థానిక పోలీసులు, RK ఫౌండేషన్‌కు సమాచారం అందించి సనత్‌నగర్‌లోని ప్రవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. పావలా శ్యామల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సినీ ప్రముఖులు సహాయం చేయాలని అభిమానులు కోరుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..

ఎక్కువ మంది చదివినవి :  Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..

Follow Us