Ranya Rao gold smuggling case: నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో మరో ట్విస్ట్.. తరుణ్‌రాజ్‌ అరెస్ట్ చేసిన పోలీసులు

|

Mar 18, 2025 | 11:23 AM

బంగారం స్మగ్లింగ్‌ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. బెంగళూరు మాత్రమే కాకుండా గోవా , ముంబై నుంచి కూడా రన్యా రావు దుబాయ్‌కు వెళ్లినట్టు DRI అధికారులు వెల్లడించారు. హవాలా మార్గంలో డబ్బులతో బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. 45 సార్లు దుబాయ్‌కు ఉదయం వెళ్లిన రన్యా సాయంత్రానికి తిరిగి వచ్చినట్టు తెలిపారు

Ranya Rao gold smuggling case: నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో మరో ట్విస్ట్.. తరుణ్‌రాజ్‌ అరెస్ట్ చేసిన పోలీసులు
Tarun Raj , Ranya Rao
Follow us on

దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. రన్యా రావు, మరో నిందితుడు తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉపయోగించి దుబాయ్ చెక్‌పోస్టుల ద్వారా బంగారాన్ని పంపినట్లు దర్యాప్తులో తేలింది. గత వారం రన్యా రావు బెయిల్ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు ముందు ఉంచిన పత్రాలలో, నటిని అరెస్టు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చివరిసారిగా సందర్శించినప్పుడు దుబాయ్‌లో నటి రన్యా రావు చేసిన కస్టమ్స్ డిక్లరేషన్లలో, ఆమె జెనీవాకు బంగారాన్ని రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నట్లు వెల్లడించింది.

తాజాగా రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రన్యారావు వెనుక కింగ్‌పిన్‌గా ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్‌ను పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌లో విరాట్ అలియాస్ తరుణ్‌రాజ్‌ కొండూరుది కీలక పాత్రగా గుర్తించారు DRI అధికారులు. 2019 నుంచి రన్యారావుతో తరుణ్‌రాజ్‌కు సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది.

దుబాయ్‌లో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవడానికి.. తరుణ్‌రాజ్‌ తన US పాస్‌పోర్ట్ ఉపయోగించాడు.  US పాస్‌పోర్ట్‌తో చెకింగ్ లేకుండానే దుబాయ్ నుంచి బెంగుళూరుకు గోల్డ్ స్మగ్లింగ్ చేశారు. అంతే కాదు తరుణ్‌రాజ్‌తో కలిసి పలుమార్లు దుబాయ్‌ వెళ్ళింది రన్యారావు. ఇక ఇప్పుడు స్మగ్లింగ్‌ కేసులో తరుణ్‌రాజ్‌ను DRI టీమ్‌ ప్రస్తుతం విచారిస్తోంది. మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి