
రీసెంట్ డేస్‌లో సినీ సెలబ్రెటీల విడాకుల వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది కొంతమంది సెలబ్రెటీలు ప్రేమ విషయాన్నీ బయట పెట్టారు, కొందరు పెళ్లి పీటలెక్కారు. మరికొంతమంది విడాకులు కూడా తీసుకున్నారు. ఊహించని విధంగా సినిమా సెలబ్రెటీలు విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు కొత్త ఏడాది ప్రారంభంలోనే ఓ సినీ సెలబ్రెటీ జంట విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు. దాంతో ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు. 16 ఏళ్లు కలిసున్న ఈ జంట తాజాగా విడాకులు ప్రకటించారు. ఇంతకూ ఆ జంట ఎవరసంటే..
జై భానుశాలి,మహి విజ్.. ఈ జంట గురించి టీవీ చూసే ఆడియన్స్ కు తెలిసే ఉంటుంది. ఇన్ని రోజులు లవబుల్ కపుల్ గా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ షేర్ చేశారు. 16 ఏళ్లు కలిసున్న ఈ ఇద్దరు ఇప్పుడు విడిపోయారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. గత ఏడాది నుంచి ఈ ఇద్దరు మధ్య సమస్యలు తలెత్తాయని తెలుస్తుంది.
ఇక జై భానుశాలి, మహి విజ్ విడిపోతున్నట్టు అనౌన్స్ చేయడంతో పాటు ఓ విజ్ఞప్తి చేశారు. ఇద్దరూ విడిపోయినా కూడా తమ పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా.. మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం అని తెలిపారు. ” మేము వేరు దారుల్లో నడుస్తున్నా.. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ కానీ.. డ్రామా కానీ లేదు. మేము కేవలం ప్రశాంతతనే ఎంచుకున్నాం.. మేము ఒకరిని ఒకరం గౌరవించుకుంటూనే ఉంటాం. స్నేహబంధం అలాగే కొనసాగుతుంది. ఈ సమయంలో మాకు మీ ప్రేమ, గౌరవం, దయ అవసరం అని రాసుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.