Jana Nayagan OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి విజయ్ చివరి సినిమా.. ‘జన నాయగన్’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జన నాయగన్'. తెలుగులో 'జన నాయకుడు' గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది.

Jana Nayagan OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి విజయ్ చివరి సినిమా.. జన నాయగన్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Tamilnadu CM Thalapathy Vijay Last Movie Jana Nayagan

Updated on: Aug 17, 2026 | 6:53 PM

కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు). డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే మమితా బైజు విజయ్ కూతురిగా యాక్ట్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్యలతో అనూహ్యంగా పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత ఏకంగా హెచ్ డీ ప్రింట్ పైరసీలో రావడం విజయ్ అభిమానులను నిరాశపర్చింది. అయితే అన్నీ అడ్డంకులను దాటి జులై 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది జన నాయగన్ సినిమా. కానీ ఈ మూవీకి మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. విజయ్ అభిమానులకు ఈ మూవీ బాగానే నచ్చినప్పటికీ న్యూట్రల్ ఆడియెన్స్ కు మాత్రం పెద్దగా నచ్చలేదు. తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్న విజయ్ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో మిక్స్ డ్ టాక్ కే పరిమితమైంది. అయితే విజయ్ ఆఖరి సినిమా కావడంతో దళపతి అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఫలితంగా ఈ సినిమాకు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న జన నాయగన్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. తాజాగా విజయ్ ఆఖరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 21 నుంచి జన నాయగన్ సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు జీ5 అధికారికంగా వెల్లడించింది. “బంగారం.. దళపతి జన నాయగన్ జీ5లో ఆగస్ట్ 21న మిమ్మల్ని కలవనున్నాడు” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసిన జీ 5.. తమిళనాడు సీఎం అంటూ విజయ్ ని ట్యాగ్ చేసింది. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో జన నాయగన్ సినిమా ఒకేసారి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

జీ 5 ఓటీటీలో విజయ్ జన నాయగన్..

జన నాయగన్ సినిమా ట్రైలర్ తెలుగులో.,

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us