AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు నో చెప్పా..! అందుకు నేనేం పెద్ద బాధపడలేదు : ఉదయభాను

ప్రముఖ టెలివిజన్ యాంకర్, నటి, నిర్మాత ఉదయభాను ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఓ స్టార్ హీరో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రంలో తనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు నో చెప్పాల్సి వచ్చిందో ఆమె వివరించారు.

అందుకే ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు నో చెప్పా..! అందుకు నేనేం పెద్ద బాధపడలేదు : ఉదయభాను
Udaybhanu
Rajeev Rayala
|

Updated on: Sep 30, 2026 | 11:53 AM

Share

ఉదయభాను గతంలో అల్లు అర్జున్ నటించిన జులాయి, రానా లీడర్ వంటి చిత్రాలలో ప్రత్యేక గీతాలలో తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే మరో బ్లాఆక్ బస్టర్ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో నటించే అవకాశం ఆమెకు వచ్చిందట. అయితే, ఈ అవకాశాన్ని ఆమె వదులుకోవాల్సి వచ్చిందట. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటి దారేది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ ను ఉదయభాను మిస్ చేసుకున్నారట. దీనికి గల కారణాన్ని వివరిస్తూ, ఆ పాటలో సమంత, ప్రణీత వంటి స్టార్స్  అలాగే  అనేక మంది ఇతర నటీనటులు ఉన్నారని, తాను ఒక టెలివిజన్ స్టార్‌గా వారి మధ్య చిన్నదిగా కనిపించాల్సి వస్తుందని భయపడ్డానని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేయను అన్నది నా ఉద్దేశం కాదు. ఆయన సినిమాలో చేయమంటే కళ్లకు అద్దుకొని చేస్తాను. కాకపోతే, కనీసం నా వరకైనా ఆ చిన్న పోర్షన్‌ను సపరేట్‌గా చూపించమని అడిగాను. మళ్లీ ఆ గుంపులో గోవిందం అయిపోతదేమోనని భయపడిపోయాను అని ఆమె తన నిర్ణయం వెనుక గల కారణాన్ని స్పష్టం చేశారు ఉదయభాను.

అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి.. ఆమె కోసమే ఆ సినిమాను 60, 70సార్లు చూశా

కొన్ని సన్నివేశాలలో ఒకరికి ఎక్కువ ప్రాధాన్యత, మరొకరికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, పోటీ వాతావరణం వంటి “నెగటివ్ ఎనర్జీస్” ఉంటాయని, వాటిని తాను తట్టుకోలేనని, అందుకే అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల పెద్దగా బాధపడలేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో  తన తోటి యాంకర్ల గురించి కూడా మాట్లాడారు. సుమను ఉద్దేశించి వెరీ స్మార్ట్ అని అన్నారు ఉదయభాను. “చాలా తెలివైన అమ్మాయి. తెలివైన అమ్మాయి కాబట్టి అన్ని షోస్ చేయగలుగుతోంది. ఇంత కాంపిటీషన్‌లో కూడా నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. ఆమె తెలివితేటలు అందరికీ ఉండవు అని సుమపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించారు.

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో అభిమానులు

రాజకీయ ప్రవేశం గురించి అడగగా, గత ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీ తనను గట్టిగా సంప్రదించిందని, కావాల్సిన నియోజకవర్గం, ఆర్థిక సహాయం గురించి కూడా అడిగారని తెలిపారు. అయితే, ఒక ఎమ్మెల్యే ఎన్నికకు కనీసం 100 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిసి తాను ఆశ్చర్యపోయానని, అంత డబ్బు తన దగ్గర లేదని అన్నారు. ప్రజల నుంచి సంపాదించుకోవచ్చని చెప్పారని, కానీ అది తన సిద్ధాంతాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. “ఎప్పుడో ఒకరోజు ఇండిపెండెంట్‌గా నిలబడి మనం చేయాల్సిన యుద్ధం చేయాలి” అని తన రాజకీయ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, వ్యవస్థలో “కొత్త నీరు రావాలి” అని ఉదయభాను చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

నువ్వేమైన పెద్ద హీరోయిన్‌వా.., అందగత్తెవా అంటూ అవమానించారు.. కట్ చేస్తే 150కుపైగా సినిమాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందుకే ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు నో చెప్పా..!
అందుకే ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు నో చెప్పా..!
స్మార్ట్‌ఫోన్లు కొనే వారికి షాకింగ్‌ న్యూస్‌.. జేబుకు చిల్లులే..!
స్మార్ట్‌ఫోన్లు కొనే వారికి షాకింగ్‌ న్యూస్‌.. జేబుకు చిల్లులే..!
షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణం అందించిన కైనన్-నీరూ జోడీ
షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణం అందించిన కైనన్-నీరూ జోడీ
'డబ్బుల వర్షం' పేరుతో మాయాజాలం!
'డబ్బుల వర్షం' పేరుతో మాయాజాలం!
తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..!
తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..!
ఫిట్‌గా ఉండడం ఇంత ఈజీనా.. కోహ్లీ ఫాలో చేసే ఆ సీక్రెట్ ఏంటో తెలుసా
ఫిట్‌గా ఉండడం ఇంత ఈజీనా.. కోహ్లీ ఫాలో చేసే ఆ సీక్రెట్ ఏంటో తెలుసా
సూపర్ ఎల్‌నినోతో దక్షిణ భారత్‌కు భారీ ముప్పు..!
సూపర్ ఎల్‌నినోతో దక్షిణ భారత్‌కు భారీ ముప్పు..!
పితృ పక్షంలో ఏ వస్తువులు దానం చేయకూడదు? ఏవి దానం చేస్తే శుభప్రదం?
పితృ పక్షంలో ఏ వస్తువులు దానం చేయకూడదు? ఏవి దానం చేస్తే శుభప్రదం?
కేవలం ఒక సెంట్‌ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..
కేవలం ఒక సెంట్‌ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..
పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు
పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు