AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay: సీఎం విజయ్ కుమారుడి మొదటి సినిమా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కోలీవుడ్ లో ఆయన స్థానం భర్తీ చేసే హీరో ఎవరన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇంతలోనే విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా తెరకెక్కించిన మొదటి సినిమా విడుదలకు సిద్ధమైంది.

CM Vijay: సీఎం విజయ్ కుమారుడి మొదటి సినిమా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
CM Vijay Son Jason Sanjay
Basha Shek
|

Updated on: May 29, 2026 | 1:52 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇప్పుడు తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. దీంతో కోలీవుడ్ లో హీరో విజయ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. మొదలైంది. ఈ నేపథ్యంలో, సీఎం విజయ్ కుమారుడి మొదటి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగాఆ మూవీ విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ కూడా త్వరలో విడుదల కానుంది. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తమిళ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సిగ్మా’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటించాడు. యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది.

విజయ్ కుమారుడి తొలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు సంపత్ రాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. జేసన్ సంజయ్ దర్శకత్వం కూడా బాగుందని ప్రశంసలు వచ్చాయి. కాగా ఈ సిగ్మా సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించారు. కాగా తండ్రిలాగే జేసన్ కూడా హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడని వదంతులు వచ్చాయి. కానీ అతను మాత్రం దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. సినిమా ప్రారంభం కావడానికి ముందే సంజయ్, విజయ్‌కి కథ చెప్పాడని, విజయ్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే మరోవైపు గత కొన్ని నెలలుగా విజయ్ వ్యక్తిగత జీవితం గందరగోళంలో ఉంది. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అలాగే విజయ్ -త్రిష లు పెళ్లి చేసుకోనున్నారంటూ రూమర్లు వస్తున్నాయి. ఇక సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, విజయ్ కుమారుడు సంజయ్ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి విజయ్ పేరును తొలగించాడు. మరి తన కుమారుడి తొలి సినిమా విడుదలపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

జులై 31న సిగ్మా రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us