The Legend OTT: అన్న వచ్చేస్తున్నాడు.. ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ది లెజెండ్.. ఎప్పుడంటే

|

Nov 25, 2022 | 3:20 PM

హీరో అవ్వాలనే కలను చాలా  ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్  స్టోర్స్ అధినేత అయిన శరవణన్  గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే

The Legend OTT: అన్న వచ్చేస్తున్నాడు.. ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన ది లెజెండ్.. ఎప్పుడంటే
The Legend
Follow us on

లెజెండ్ శరవణన్ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఆ మధ్య కాలంలో శరవణన్ పేరు కాస్త గట్టిగానే వినిపించింది. ఐదుపదుల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు లెజెండ్ శరవణన్. హీరో అవ్వాలనే కలను చాలా  ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్  స్టోర్స్ అధినేత అయిన శరవణన్  గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డారు. ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్‌ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్‌ పుట్ తో.. థియేటర్లలో రిలీజ్‌ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు.

అయితే  ఈ సినిమా ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. తన సినిమాను ఓటీటీ రిలీజ్ చేసేందుకు శరవణన్ ఇష్టపడలేదని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. గతంలో ఈ సినిమాకు డీసెంట్ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆయన ఒప్పుకోలేదట. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ కు శరవణన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

డిసెంబర్ నెలలో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని సమాచారం. క్రిస్‌మాస్ కానుకగా మరి ఇక్కడ ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి