Tollywood: స్పెషల్ సాంగ్ అంటే సై అంటున్న అందాల భామలు వీరే..

హీరోయిన్స్‌ స్పెషల్ సాంగ్ చేయటమా.. అలా చేస్తే కెరీర్ అటకెక్కినట్టే.. మళ్లీ మెయిన్ లీడ్‌ రోల్స్ వస్తాయా..? ఇదంతా పాత మాట. ఈ జనరేషన్ హీరోయిన్లు స్టార్ ట్యాగ్‌ కంటిన్యూ చేస్తూనే గ్లామర్‌ షోకు సై అంటున్నారు.

Tollywood: స్పెషల్ సాంగ్ అంటే సై అంటున్న అందాల భామలు వీరే..
Samantha Pooja

Updated on: Apr 16, 2022 | 9:12 PM

హీరోయిన్స్‌ స్పెషల్ సాంగ్ చేయటమా.. అలా చేస్తే కెరీర్ అటకెక్కినట్టే.. మళ్లీ మెయిన్ లీడ్‌ రోల్స్ వస్తాయా..? ఇదంతా పాత మాట. ఈ జనరేషన్ హీరోయిన్లు స్టార్ ట్యాగ్‌ కంటిన్యూ చేస్తూనే గ్లామర్‌ షోకు సై అంటున్నారు. స్పెషల్‌ సాంగ్స్‌తో సినిమాలకు స్పైస్ యాడ్ చేస్తున్నారు. తాజాగా మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద జిగేల్‌మనిపించేందుకు రెడీ అవుతున్నారు బుట్టబొమ్మ. ఊ అంటావా మామ ఉఉ అంటావా అంటూ బన్నీతో కలిసి హోయలు పోయిన సమంతను మర్చిపోక ముందే.. మరో గ్లామర్ క్వీన్ స్పెషల్ సాంగ్‌కు రెడీ అవుతున్నారు. ఎఫ్ 3 సినిమాలో వెంకీ, వరుణ్‌తో కలిసి స్టెప్పేసేందుకు సై అంటున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ విషయంలో చిత్రయూనిట్ కూడా అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

పూజా స్పెషల్ సాంగ్ చేయటం ఇది ఫస్ట్ టైమేం కాదు. రంగస్థలం సినిమాలోనూ జిగేలు రాణి పాటకు చెర్రీతో కలిసి స్పెప్పేశారీ అరవింద. ఆ సినిమాతో పాటు.. జిగేల్‌ పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో స్టార్ హీరోయిన్ స్పెషల్‌ సాంగ్‌ అన్నది హిట్ సెంటిమెంట్‌గా ముద్రపడిపోయింది. గతంలో హీరోయిన్‌గా ఫామ్‌లో ఉన్న బ్యూటీస్‌ స్పెషల్ సాంగ్ చేయాలంటే పెద్దగా ఇంట్రస్ట్ చూపించే వారు కాదు. అందుకే ఐటమ్ సాంగ్స్‌ కోసం బాంబే మోడల్స్‌ను పట్టుకొచ్చేవారు తెలుగు మేకర్స్‌. కానీ ఇప్పుడు ట్రెండ్ వేరు. సినిమాల్లో హీరోయిన్‌గా సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తూనే.. స్పెషల్‌ సాంగ్స్‌లో తళుక్కుమంటున్నారు బ్యూటీస్‌. సమంత, పూజా మాత్రమే కాదు.. తమన్నా, కాజల్‌ అగర్వాల్ లాంటి బ్యూటీస్ కూడా స్పెషల్ సాంగ్స్‌తో సినిమాలకు గ్లామర్ యాడ్ చేస్తున్నారు. ముందు ముందు లిస్ట్‌లోకి మరింత మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Happy Birthday JD Chakravarthy: పలు భాషల్లో విలక్షణ నటుడి హవా.. వరుస సినిమాలతో జేడీ చక్రవర్తి ఫుల్ బిజీ..

Avantika Mishra: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘వైశాఖం’ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Jayamma Panchayathi: జయమ్మ పంచాయతీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సుమక్క..