చెత్త కుప్పలో నల్లటి ఆకారం..! ట్రైలరే ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో..

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా అన్ని సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లోనే విడుదలవుతున్నాయి. కంటెంట్ ఉంటే చాలు సినిమాలు దుమ్మురేపుతున్నాయి. అన్ని భాషల్లో భారీ హిట్ సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఓ సినిమా కూడా అదే రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

చెత్త కుప్పలో నల్లటి ఆకారం..! ట్రైలరే ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో..
Movie

Updated on: May 28, 2025 | 10:05 PM

ప్రతి శుక్రవారం థియటర్స్ లో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒక వైపు ఓటీటీల్లో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. థియటర్స్‌లో కొత్త కొత్త సినిమాలు విడుదలై ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా వరుసగా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. తాజాగా ఓ సినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినీ ఇండస్ట్రీలో క్రైమ్ థ్రిల్లర్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు ఇదే కంటెంట్ తో ఓ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆడియన్స్ ను షాక్ కు గురిచేసేలా ఉంది. ఇంతకూ ఆ ట్రైలర్ ఏదంటే..

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన

విలక్షణ నటుడు విజయ్ ఆంటోని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు విజయ్ ఆంటోని. తాజాగా ఈ వర్సటైల్ హీరో నటిస్తున్న సినిమా మార్గన్. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ మూవీ ఆసక్తికరమైన మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

ఇది కూడా చదవండి :రఫ్‌గా హ్యాండిల్ చేశారు.. లిప్ లాక్ తర్వాత స్టార్ హీరోయిన్‌కు వాంతులు.. ఓపెనైన నటి

తాజాగా విడుదలైన ట్రైలర్లో విజయ్ ఆంటోని రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపించారు. వాటిలో ఒకటి ఒకటి గాయపడిన ఇంటెన్స్ లుక్‌, మరొకటి నీటి అడుగున ఉన్న ఆసక్తికరమైన షాట్‌. స్లో మోషన్ షాట్స్, నైట్ ఎఫెక్ట్స్, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు టీజర్‌ను థ్రిల్లింగ్‌గా మార్చాయి. విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం అందించారు. రాజశేఖర్ కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. మార్గన్ జూన్ 27, 2025న విడుదల కానుంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.