హీరో శింబు పెళ్లిపై క్లారిటీ..!

తమిళ హీరో శింబు త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నాడ‌ని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లండన్‌కు చెందిన అమ్మాయి మెడ‌లో ఈ హీరో మూడు ముళ్లు వేయ‌బోతున్నాడ‌న‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆమె శింబు రిలేటీవ్స్ అమ్మాయని కూడా చెప్పుకొచ్చారు.

హీరో శింబు పెళ్లిపై క్లారిటీ..!

Updated on: Jun 08, 2020 | 8:43 PM

తమిళ హీరో శింబు త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నాడ‌ని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లండన్‌కు చెందిన అమ్మాయి మెడ‌లో ఈ హీరో మూడు ముళ్లు వేయ‌బోతున్నాడ‌న‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆమె శింబు రిలేటీవ్స్ అమ్మాయని కూడా చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్‌ పూర్తయిన వీరి పెళ్లి ఉంటుంద‌ని వార్త‌లు రాశారు. మరోవైపు ఇటీవ‌ల శింబు వంట చేస్తోన్న వీడియో కూడా వైర‌ల‌య్యింది. ఆ సంద‌ర్భంలో తనకు కాబోయే భార్యను ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వని, ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్ప‌డంతో ఈ రూమ‌ర్స్ మ‌రింత జోరందుకున్నాయి.

ఈ నేపథ్యంలో శింబు పేరెంట్స్ టి. రాజేందర్‌, ఉషా రాజేందర్‌ ప్రకటన రిలీజ్ చేశారు. తమ కుమారుడికి కాబోయే భార్యను ఇంకా డిసైడ్ చెయ్య‌లేద‌ని, బంధువుల అమ్మాయితో మ్యారేజ్ జ‌ర‌గ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. శింబు పెళ్లంటూ రాసిన న్యూస్ కేవలం రూమ‌ర్స్ అని చెప్పారు. ‘ప్రస్తుతం మా అబ్బాయికి తగిన అమ్మాయి కోసం వెతుకుతున్నాం. ఇద్దరి జాతకాలు చూస్తున్నాం’ అని వివ‌రించారు.

శింబు 2019లో ‘వంత రాజవథన్ వరువేన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తీసిన షార్ట్ ఫిల్మ్ లో త్రిషతోపాటు న‌టించారు. దీనికి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రస్తుతం వెంకట్‌ ప్రభుతో కలిసి ‘మానాడు’ కోసం వ‌ర్క్ చేస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది.