
సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్ దంపతుల గురించి తెలిసే ఉంటుంది. తెలుగు సినిమాలంటే వీరికి విపరీతమైన అభిమానం. కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయ్యిందంటే చాలు.. ఈ దంపతులు రీల్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో కర్ల్ స్వాన్‌బెర్గ్ దంపతులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి రీల్స్, వీడియోలకు కూడా నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. తాజాగా ఈ జంట అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమాలోని సీన్ ను రీ క్రియేట్ చేశారు. ఆటోలో కూర్చుని రష్మికను ముద్దు అడిగే రొమాంటిక్ సీన్‌లో వీరిద్దరు జీవించేశారు. ‘బిఫోర్ మ్యారేజ్.. ఆఫ్టర్ మ్యారేజ్ అంటూ పుష్ప, పుష్ప-2 చిత్రాల్లోని సీన్స్ జోడించారు. కర్ల్ స్వాన్‌బెర్గ్ దంపతుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడే కాదు . ఈ జంట గతంలో పలు టాలీవుడ్ సినిమాల పాటలకు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. త్వరలోనే ఈ జంట ఇండియాకు రానుంది. హైదరాబాద్‌ను కూడా సందర్శిస్తామని ప్రకటించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో రాకా అనే సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్ హీరోగా. హాలీవుడ్ రేంజ్ లో సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కతోంది. త్వరలోనే ఈ మూవీస్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.